టాలీవుడ్ నంబర్ 1 హీరో ప్రభాస్.. సినిమాలు ఫ్లాపైనా ప్రభాస్ టాప్ అంటూ?

ఆర్మాక్స్ మీడియా సర్వే ఫలితాలు ప్రతి నెలా మారుతూ ఉంటాయనే సంగతి తెలిసిందే.

తాజాగా ఆర్మాక్స్ మీడియా ఆగష్టు నెల ఫలితాలు వెలువడగా ఈ జాబితాలో టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోగా ప్రభాస్ నిలిచారు.

ప్రభాస్ గత రెండు సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు.సాహో తెలుగు రాష్ట్రాలలో ఫ్లాప్ గా నిలిచినా హిందీలో మాత్రం సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.

సినిమాలు ఫ్లాపైనా ప్రభాస్ టాప్ లో ఉండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.ప్రభాస్ తర్వాత ఈ జాబితాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉన్నారు.

గత కొన్నేళ్లుగా వరుస విజయాలను సొంతం చేసుకున్న తారక్ పలు సందర్భాల్లో ఆర్మాక్స్ సర్వేలో నంబర్ వన్ స్థానంలో నిలవగా ఈ నెల ఫలితాలలో మాత్రం ఆయన రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.ఈ జాబితాలో మూడో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు.

Advertisement

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉండగా మహేష్ బాబు ఐదో స్థానంలో ఉన్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలవగా న్యాచురల్ స్టార్ నాని ఏడో స్థానంలో నిలిచారు.విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలలో నిలవడం గమనార్హం.హీరోయిన్ల విషయానికి వస్తే సమంత ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో నిలవడం గమనార్హం.

ప్రభాస్ ప్రస్తుతం పెదనాన్న చనిపోయిన బాధలో ఉన్నారు.కొంతకాలం పాటు ప్రభాస్ షూటింగ్ లకు తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.వచ్చే నెల నుంచి ప్రభాస్ రెగ్యులర్ షూటింగ్స్ లో పాల్గొంటారని తెలుస్తోంది.

వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సలార్ సినిమాలు రిలీజ్ కానున్నాయి.ఈ సినిమాలు ప్రభాస్ కోరుకున్న సక్సెస్ ను అందిస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..
Advertisement

తాజా వార్తలు