అనుష్క ప్రభాస్‌ల మద్య ప్రేమ వ్యవహారం ఉందంటూ చాలా సార్లు మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరిగింది.
ఇలాంటి సమయంలో అనుష్క తాజాగా ఒక టీవీ షోలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.ప్రభాస్‌పై తనకున్న అభిమానంను ఒక్క మాటలో ఆమె చెప్పుకొచ్చింది.
ఈమె వ్యాఖ్యలతో మళ్లీ చర్చకు తెర లేపినట్లయ్యింది.
త్వరలో అనుష్క నిశబ్దం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
ఏప్రిల్ 2న సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.కరోనా ప్రభావం అప్పటి వరకు తగ్గితే సినిమా విడుదల అవ్వబోతుంది.
లేదంటే వాయిదా వేస్తారనే సమాచారం అందుతోంది.అయితే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మాత్రం ఆపడం లేదు.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా ఒక టీవీ షోలో పాల్గొన్నారు.

ఆ సందర్బంగా యాంకర్ సుమ మాట్లాడుతూ ప్రభాస్ ఫొటో చూపించి ఇతడి గురించి ఏమైనా స్పందించండి అంటూ కోరింది.అప్పుడు అతడు నా కొడుకు అంటూ కామెంట్స్ చేసింది.బాహుబలిలో అనుష్కకు ప్రభాస్ కొడుకుగా నటించాడు కనుక అనుష్క ఆ కామెంట్స్ చేసింది.
వెంటనే సుమ స్పందిస్తూ మరి అమరేంద్ర బాహుబలి గురించి చెప్పండి అంటే ఇతడు నా కొడుకు అయితే అతడి గురించి చెప్పేది ఏముంటుంది మీకు తెల్సిందేగా అంటూ ఆశ్చర్యకరంగా ప్రభాస్ పై తనకున్న అభిమానంను చూపించింది.