టాలీవుడ్ యంగ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే బాలయ్య బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కి హాజరైన విషయం తెలిసిందే.అందుకు సంబంధించిన ప్రోమో లు కూడా విడుదల అయ్యాయి.
ఈ క్రమంలోని పూర్తి ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు ప్రసారమవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు.దీంతో ప్రభాస్ పాల్గొన్న ఎపిసోడ్ ని బాహుబలి 1 బాహుబలి 2 ఎపిసోడ్స్ గా విడుదల చేసేలా ప్లాన్ చేసింది ఆహా.ఇక తాజాగా డిసెంబర్ 29న ఎపిసోడ్ ప్రారంభం అయింది.ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తన కెరియర్ లో జరిగిన ఎన్నో విషయాలు గురించి, వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నారు.
ఈ సందర్భంగా బాలయ్య బాబు రాజమౌళి గురించి ప్రశ్నిస్తూ చత్రపతి సినిమాతోనే రాజమౌళి గురించి తెలిసి ఉండాలి కదా? అయినా బుద్ధి రాలేదా మళ్లీ రాజమౌళి తోనే బాహుబలి సినిమా చేశావు అంటూ నవ్వుతూ ప్రశ్నించడంతో.ఆ విషయంపై స్పందించిన ప్రభాస్ చత్రపతి సినిమాతోనే రాజమౌళి గారి గురించి నాకు తెలిసిపోయింది.
ఆయన విషయంలో నాకు అనుభవం ఉంది.కానీ రానాకి అప్పటికి ఇంకా ఏం తెలియదు.
బాహుబలి మేం ఫైనల్ అయిన తర్వాత రాజమౌళి అంటూ ఏంటో చెప్పాను.ఇక మనవాడు కాస్త ఫుట్బాల్ ఆడుకుంటాడు అని షూటింగ్ కి ముందే రానాకి చెప్పాను అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు ప్రభాస్.
చత్రపతి సినిమా షూటింగ్ మొదలైన నాలుగు రోజుల తర్వాత రాజమౌళి గారు గొప్ప మనిషి అని నాకు అర్థమయింది అప్పటినుంచి నాకు ఆయన మంచి స్నేహితుడు అయిపోయాడు అని చెప్పుకొచ్చాడు ప్రభాస్.

ఇక రాజమౌళి సినిమా విరామ సన్నివేశాలు షూట్ చేసేటప్పుడు సెట్ మొత్తం చుట్టూ జనాలు ఉంటారు.వాళ్ళందరి ముందు డైలాగ్ చెప్పడానికి సిగ్గుగా అనిపించింది.ఈ విషయాన్ని రాజమౌళితో చెప్పి ఈ సీన్ వరకు మూకీగా యాడ్ చేశాను.
అప్పుడు అక్కడున్న వారందరూ రిహార్సల్స్ అనుకున్నారు అని తెలిపాడు ప్రభాస్.అలా జక్కన్న నేను ఏది అంటే అది చేసే ఫ్రీడమ్ నాకు ఇచ్చారు.
ఏది చెబితే అది చేస్తారు అని తెలిపాడు ప్రభాస్.వీటితో పాటుగా ఇంకా ఎన్నో విషయాల గురించి స్పందించాడు ప్రభాస్.
ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.







