యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యాక్షన్ లో దూకేందుకు సిద్ధమవుతున్నాడు.బాహుబలి రెండో భాగం కోసం కసరత్తులు మొదలయ్యాయి.
దొరికిన గ్యాప్ లో లుక్ మార్చేసిన ప్రభాస్, తిరిగి బాహుబలి లుక్ లోకి వచ్చేస్తున్నాడు.
ఒక నేషనల్ వెబ్ సైట్ తో ప్రభాస్ మాట్లాడుతూ ” విరామం దొరకడంతో లుక్ తో పూర్తిగా మారిపోయింది.
షూటింగ్ దగ్గరపడుతోంది.మళ్ళీ మీసాలు పెంచుతున్నాను.
మొదటి భాగంలో నా బరువు 95 కేజీలు, ఇప్పుడు తగ్గాను, మళ్లీ పెరగాలి.రోజు జిమ్ లో గడుపుతున్నాను, మళ్ళి మొదటి భాగంలో ఉన్నంత బలంగా, బరువుగా కనిపించాలిగా ” అంటూ తన చేస్తున్న కసరత్తుల గురించి తెలిపాడు.
వచ్చే నెల రెండోవారంలో బాహుబలి రెండోభాగం మొదలవుతుంది.ఇంతకుముందు అన్నౌన్స్ చేసినట్టుగానే వచ్చే ఏడాది చివర్లో సినిమా విడుదల అవుతుంది.







