మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఒక పద్ధతి ఉంటుంది.ఏదైనా సినిమా కోసం హీరో లేదా హీరోయిన్ లేదంటే ఒక పెద్ద సెలబ్రిటీని ఎంచుకున్నారు అంటే వారికి దానికి తగిన రెమ్యూనరేషన్( Remuneration ) ఆ టైంలో ఆ ట్రెండుకు తగినట్టుగా ఇవ్వాల్సి ఉంటుంది.
దాంతో పాటు ఆ సెలబ్రిటీకి అసిస్టెంట్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, మేకప్ మాన్, హెయిర్ స్టైలిస్ట్, కాస్ట్యూమర్, అసిస్టెంట్ ఇలా రకరకాల వ్యక్తులు ఉంటారు.ఇలా ఉన్నప్పుడే ఆ వ్యవస్థ చాలా సవ్యంగా జరుగుతుంది.
అలాగే అనుకున్న టైం కి సినిమా సెట్ మీ ఇంటికి వెళ్తుంది.కానీ మరి ఇంతమందికి డబ్బులు ఎవరి పే చేస్తారు.? కేవలం సదరు నటుడికి రెమ్యూనరేషన్ ఇస్తే సరిపోతుందా? మిగతా వారికి కూడా రెమ్యునరేషన్ ఎవరు పే చేయాలి ? నిర్మాత( Producer )పై భారం మోపాల్సిందేనా లేక సొంతంగా ఆ ఆర్టిస్టు పెట్టుకుంటాడా అనే విషయాలు చాలా మందికి తెలియదు.

సాధారణంగా ఇప్పుడు ఉన్న సెలబ్రిటీలు తమ పారితోషకంతో పాటు తమ అసిస్టెంట్ కి కూడా ఆ రోజుకి పే చేయాల్సిందే అని నిర్మాతలపై భారం మోపుతున్నారు.గతంలో ఇలా ఉండేది కాదు నెల జీతాలకు పని చేసిన మన సెలబ్రిటీలు మిగతా ఖర్చులు ఏవి కూడా పెద్దగా చేసేవారు కాదు.సొంతంగా వారే పాడేవారు, డబ్బింగ్ చెప్పేవారు, మేకప్ చేసుకునేవారు, నిర్మాతను కాపాడుకునేవారు.
కానీ ఇప్పటి పరిస్థితులు అలా కాదు కదా అన్ని నిర్మాత పైనే భారం మోపుతున్నారు.అందుకే ఒక సినిమా పూర్తి చేసే లోపు నిర్మాత దగ్గర ఉన్న డబ్బు పూర్తిగా అయిపోతుంది.
అలాగే రోడ్డు మీద కూడా పడుతున్నాడు.అది ఆడితే ఓకే కానీ ఆడకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే ఇప్పుడున్న సెలబ్రిటీలలో ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ నడుస్తున్న కారణంగా ఒకే ఒక సెలబ్రిటీ మాత్రం ఈ అన్ని విషయాలకు మినహాయింపు గా ఉన్నాడు.అతడు మరెవరో కాదు మొట్టమొదటి తెలుగు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.

ప్రభాస్( Prabhas ) కి కేవలం ఒక రెమ్యూనికేషన్ ఇస్తే సరిపోతుంది.ఆ రెమ్యూనరేషన్ క్లారిటీగా ఉంటుంది.ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు.మేనేజర్స్ ని, అసిస్టెంట్ ని, మేకప్ ని అనే ఈ వ్యవస్థ మొత్తాన్ని తనే మెయిన్టైన్ చేసుకుంటాడు.
క్యారవాన్ కూడా సొంతంగా తానే పెట్టుకుంటాడు దాని మెయింటనెన్స్, డ్రైవర్ జీతాలు కూడా తానే ఇచ్చుకుంటాడు, ఇలా ఒక రెమ్యునరేషన్ ఇచ్చిన తర్వాత సింగిల్ రూపీ కూడా మళ్ళీ నిర్మాత అతని టీం కి పే చేయాల్సిన అవసరం లేదు.చివరికి బౌన్సర్స్ కి కూడా తానే పే చేసుకుంటాడు.
ఇది ఒక రాజు లక్షణం.ప్రభాస్ పుట్టిన కుటుంబం వల్ల అతనికి వచ్చిన మంచి లక్షణం.







