పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas ) బాహుబలి సిరీస్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు.ఈ సిరీస్ తర్వాత ఈయన మార్కెట్ వరల్డ్ వైడ్ గా భారీగా పెరగడంతో నిర్మాతలు క్యూ కడుతూ భారీ సినిమాలను ప్రకటించారు.
బాహుబలి తర్వాత ప్రభాస్ మళ్ళీ మరో సినిమా హిట్ అందుకోక పోయిన కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా ఫుల్ బిజీగా వరుసగా పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషీ ఇస్తున్నాడు.మరి ప్రభాస్ 21 ఏళ్ల క్రితం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఇక ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ గా తనని తాను నిరూపించుకుని సత్తా చాటుతున్నాడు.ఈ రోజు డార్లింగ్ తన 21 ఏళ్ల కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్నాడు.
ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన ఈశ్వర్ సినిమాకు నేటితో 21 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

ఈ క్రమంలోనే ప్రభాస్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.కాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్టజ యూవీ క్రియేషన్స్ వారు తమ అభిమాన హీరోకు ప్రత్యేకంగా 21 ఏళ్ల సక్సెస్ ఫుల్ కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా కొద్దిసేపటి క్రితం పోస్టర్ ను రిలీజ్ చేయగా ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.

కాగా మరొక నెల రోజుల్లో ఈయన నటించిన ‘సలార్’ ( Salaar ) సినిమా రిలీజ్ కానుంది.డిసెంబర్ 22న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.ఇదైనా బ్లాక్ బస్టర్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటి వరకు వచ్చిన ప్లాప్స్ అన్ని మర్చిపోయి సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నారు.
మరి వరుస ప్లాపుల నేపథ్యంలో ఈ సినిమా అయినా హిట్ అయ్యి హిట్ అవుతుందో లేదో చూడాలి.







