ది రాజాసాబ్ మూవీ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్.. మారుతి రియాక్షన్ ఇదే!

ప్రభాస్ , మారుతి( Prabhas, Maruti ) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయనే సంగతి తెలిసిందే.

ప్రభాస్ మారుతి ది రాజాసాబ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.అయితే ది రాజాసాబ్ మూవీ వాయిదా పడటంతో ఫ్రస్టేషన్ గా ఫీలవుతున్నారు.

అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు మారుతి కొన్ని సమాధానాలు ఇచ్చారు.ది రాజాసాబ్ మూవీ( The Rajasaab Movie ) రిలీజ్ అనేది నా ఒక్కడి చేతిలో లేదని మారుతి తెలిపారు.

ఎలాంటి అప్ డేట్ అయినా పీపుల్స్ మీడియా నిర్మాణ సంస్థ( Peoples Media Production Company ) నుంచి వస్తాయని ఆయన పేర్కొన్నారు.ది రాజాసాబ్ సినిమాకు సంబంధించి కొంత టాకీ, పాటల షూటింగ్ పెండింగ్ లో ఉందని మారుతి చెప్పుకొచ్చారు.

Prabhas Fans Frustation About The Rajasaadb Movie Details Inside Goes Viral In S
Advertisement
Prabhas Fans Frustation About The Rajasaadb Movie Details Inside Goes Viral In S

ది రాజాసాబ్ సినిమా కోసం చాలా గ్రాఫిక్స్ సంస్థలు పని చేస్తున్నాయని కొన్ని సంస్థలు ఇచ్చిన ఔట్ పుట్ బాగుందని మారుతి పేర్కొన్నారు.షూటింగ్ పూర్తైన వెంటనే పాటలు రిలీజ్ చేస్తామని ఆయన వెల్లడించారు.మా కష్టాన్ని చూపించడానికి మేము కూడా ఎదురుచూస్తున్నామని మారుతి పేర్కొన్నారు.

ది రాజాసాబ్ మూవీ ఈ ఏడాదే థియేటర్లలో విడుదలవుతుందో లేదో చూడాల్సి ఉంది.

Prabhas Fans Frustation About The Rajasaadb Movie Details Inside Goes Viral In S

రాబోయే రోజుల్లో అయినా ది రాజాసాబ్ గురించి క్లారిటీ వస్తుందేమో చూడాలి.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కు సైతం ది రాజాసాబ్ మూవీ సక్సెస్ సాధించడం కీలకమనే సంగతి తెలిసిందే.ది రాజాసాబ్ మూవీ ఇతర భాషల్లో ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.

ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.రెమ్యునరేషన్ పరంగా కూడా స్టార్ హీరో ప్రభాస్ టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.

శ‌రీరంలో ఫోలిక్ యాసిడ్ లోపిస్తే..ఏ స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా?
Advertisement

తాజా వార్తలు