యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరో గా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం సలార్.ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న విషయం తెలిసిందే.
సెప్టెంబర్ లో ఈ సినిమా యొక్క మొదటి భాగం విడుదల చేయబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.సినిమా ను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్న నేపథ్యం లో అభిమానులు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సలార్ సినిమా టీజర్( Salaar Teaser ) ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ప్రభాస్ అభిమానులు కొందరు పెదవి విరుస్తున్నారు.

దర్శకుడు ప్రశాంత్ నీల్( Director Prashant Neel ) ఈ సినిమా ను పదే పదే కేజీఎఫ్ సినిమా ను మించిన యాక్షన్స్ సన్నివేశాలు ఉంటాయని.కేజీఎఫ్ సినిమా ను మించిన విజువల్ వండర్ గా ఉంటుంది అంటూ వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు.కానీ టీజర్ చూస్తుంటే ఈ సినిమా కేజీఎఫ్( KGF ) స్థాయి లో ఉంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
టీజర్ లోనే ప్రభాస్ స్టామినా మరియు సినిమా స్టామినా చూపించాల్సి ఉంది.కానీ దర్శకుడు ఆ విషయం లో విఫలం అయ్యాడు అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.

మొత్తానికి సలార్ సినిమా విషయం లో అభిమానులు కొందరు ఆహా ఓహో అంటూ ఆనందం వ్యక్తం చేస్తుంటే కొందరు మాత్రం కేజీఎఫ్ పోలుస్తూ ఆ స్థాయిలో లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సినిమా విడుదలైన తర్వాత కానీ అసలు విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.ప్రభాస్ వరుస పరాజయాలకు ఈ సినిమా బ్రేక్ వేస్తుందా అనేది చూడాలి.ఈ చిత్రం లో ప్రభాస్ కి జోడిగా శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడని వార్తలు కూడా జోరుగా వస్తున్నాయి.







