టాలీవుడ్ హీరో ప్రభాస్( Prabhas ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీబిజీగా గడుపుతున్నారు ప్రభాస్.ప్రస్తుతం ప్రభాస్ నటించిన సలార్ సినిమా( Salaar ) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ టీజర్లు ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అలాగే ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టు కే సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే.
ఇకపోతే ఇటీవలే కాళ్లకు సర్జరీ చేయించుకున్న ప్రభాస్ రెస్ట్ తీసుకుంటున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ప్రభాస్ ను పెట్ నేమ్ తో పిలిస్తే అస్సలు నచ్చదట.
ప్రభాస్ ను చాలా మంది తన ఫ్రెండ్స్ ఉప్పు ఉప్పు అని పిలిచేవారట.ఉప్పలపాటి ప్రభాస్ ను చాలా మంది ఉప్పు అంటూ ముద్దుగా పిలిచేవారట.
అయితే మరి కొంతమంది పప్పు అంటూ కూడా నాటీగా పిలుస్తారట.ఈ రెండు పేర్లలో ఏ పేరు పెట్టి పిలిచిన ప్రభాస్ కి మహా చెడ్డ చిరాకట.
ఆయనకు పెట్ నేమ్ తో కాకుండా ఒరిజినల్ నేమ్ తో పిలిస్తేనే చాలా చాలా ఇష్టమట.
హీరోయిన్ అనుష్క( Anushka ) కూడా చాలాసార్లు ఆ పేరుతో పిలిపి సరదాగా ప్రభాస్ ని ఆటపట్టించేదట.అయితే గోపీచంద్ మాత్రం ఇప్పటికి తన ఫ్రెండ్ ప్రభాస్ పూర్తి పేరు పెట్టి పిలుస్తూ ఆయన ఇష్టా ఇష్టాలకు గౌరవిస్తున్నాడట.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.