టాలీవుడ్ హీరో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్.ఈ షో కి భారీగా ప్రేక్షకాధరణ లభిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.
బాలయ్య బాబు ఒకవైపు సినిమాలు నటిస్తూనే మరొకవైపు ఈ షోకి హోస్టుగా వ్యవహరిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు.ఈ షోద్వారా బాలయ్య బాబు తనలో ఉన్న మరొక టాలెంట్ ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు.
ఇప్పటికే సీజన్ 1 సక్సెస్ ఫుల్ గా పూర్తి కాగా ప్రస్తుతం ప్రముఖ ఓటిటి ఆహాలో సీజన్ 2 ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే పలువురు స్టార్ సెలబ్రిటీలు హాజరైన విషయం మనందరికీ తెలిసిందే.
నారా చంద్రబాబు నాయుడు,నారా లోకేష్,మాజీ ఏపీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,స్పీకర్ సురేష్ కుమార్, యువ హీరోలు శర్వానంద్, విశ్వక్సేన్,సిద్దు జొన్నలగడ్డ,అడవి శేష్ లాంటి సెలబ్రిటీలు పాల్గొన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఇటీవల దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, డి సురేష్ బాబు అలాగే అల్లు అరవింద్ లో పాల్గొన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ వైరల్ అవుతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ అన్ స్టాపబుల్ షో కి సంబంధించిన ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే బాలయ్య బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ అన్ స్టాపబుల్ షో కి టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ అయినా డార్లింగ్ ప్రభాస్ హాజరు కాబోతున్నారట.

అయితే మొదటి సీజన్లోనే ప్రభాస్ షో కి రాబోతున్నాడు అంటూ వార్తలు వినిపించినప్పటికీ అ వార్తలన్నీ అవాస్తవాలుగానే మిగిలిపోయాయి.ఇక రెండవ సీజన్ కి అయినా ఏంటి ఇస్తే బాగుంటుంది అని ప్రభాస్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు.అభిమానులు కోరుకున్న విధంగానే ప్రభాస్ ఈ షోలో సందడి చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలో షూటింగ్ హైదరాబాద్లోని జరుగుతుండడంతో బాలయ్య బాబు షోలో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.నిజంగానే బాలయ్య బాబు షో కి వస్తే ఎపిసోడ్ మామూలుగా ఉండదు అంటున్నారు.
ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్ ఒక ఎత్తు అయితే ఆ ఎపిసోడ్ మరొక ఎత్తు ఉంటుంది అంటున్నారు ప్రభాస్ అభిమానులు.దీనికి సంబంధించి ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.







