పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas ) చేతిలో ప్రస్తుతం భారీ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.మరి ఈయన చేస్తున్న సినిమాల్లో భారీ క్రేజ్ ఉన్న పాన్ ఇండియన్ మూవీలలో ”సలార్” ( Salaar ) ఒకటి.
ఈ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే( Hombale ) వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.
దీంతో ఈ లోపు ఈ సినిమా షూట్ మొత్తం ముందే పూర్తి చేయాలనీ మేకర్స్ అంతా కష్ట పడుతున్నారు.ఇప్పటికే ఈ సినిమా 70 శాతానికి పైగానే పూర్తి అయ్యింది అని ఎప్పుడో మేకర్స్ ప్రకటించారు.
అయిన కూడా ఎప్పటి నుండో ఈ సినిమా ఇంకా షూట్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది.ఇదిలా ఉండగా ఈ సినిమా సెట్స్ లో తాజాగా బర్త్ డే సెలెబ్రేషన్స్ చేసినట్టు తెలుస్తుంది.

మరి ఆ బర్త్ డే ఎవరిదో కాదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బర్త్ డే( Director Prashant Neel Birthday ) అని తెలుస్తుంది.మరి డార్లింగ్ దగ్గరుండి సలార్ డైరెక్టర్ బర్త్ డే చేసినట్టు తెలుస్తుంది.ప్రశాంత్ నీల్ బర్త్ డే వేడుకల ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి.నీల్ చేత కేక్ కట్ చేయించి సెట్స్ లో బర్త్ డే వేడుకలు చేసారు.ఈ ఫొటోల్లో ప్రభాస్ సహా యూనిట్ మొత్తం కనిపిస్తున్నారు.
మరి కేజిఎఫ్( KGF ) తర్వాత నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో వేచి చూడాలి.







