టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా మారినటువంటి ప్రభాస్ ( Prabhas ) ప్రస్తుత కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్ ఈ సినిమా తర్వాత నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఇక ఇటీవల సలార్ ( Salaar )సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేసినటువంటి ప్రభాస్ త్వరలోనే కల్కి ( Kalki )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రభాస్ ఇప్పటికే హైదరాబాద్లో కాకుండా ముంబై వంటి ప్రాంతాలలో కూడా ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేశారనే సంగతి మనకు తెలిసిందే.ఇక విదేశాలలో కూడా ఈయన పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేశారు.
ఇకపోతే ఇటీవల లండన్ ( Landon ) లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈయన అద్దెకు తీసుకున్నటువంటి ఆ ఇల్లు తెగ నచ్చడంతో ప్రభాస్ ఏకంగా ఆ ఇంటిని కొనుగోలు చేశారని సమాచారం.

ఇటీవల కాలంలో ప్రభాస్ ఎక్కువగా లండన్ లోనే ఉంటున్న సంగతి తెలిసిందే.ఇక తన మోకాలు సర్జరీ నిమిత్తం అక్కడే కొద్ది రోజులు పాటు ఉన్నటువంటి ప్రభాస్ తో అక్కడ ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారట కానీ ఆ ఇల్లు అన్ని సౌకర్యాలతో కూడుకొని ఉండడంతో ప్రభాస్ కి విపరీతంగా నచ్చి ఏకంగా కోట్లు ఖర్చు చేసి ఆ ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తుంది.ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు నీకేం తక్కువ స్వామి ఒక్కో సినిమాకు ఏకంగా వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారు.ఇలాంటి ఇల్లు కొనడం మీకు మామూలేగా అంటూ కామెంట్లు చేస్తున్నారు
.