యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.ఈయన క్రేజ్ అలాంటిది మరి.
వరుస ప్లాప్స్ వస్తున్న ఈయన సినిమాల కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ మాత్రం తగ్గడం లేదు.అంతేకాదు ఈయన సినిమాలతో కోట్ల నష్టాలు వస్తున్న బయ్యర్స్ మాత్రం మళ్ళీ మళ్ళీ కోట్లు పెట్టి సినిమాలు కొంటున్నారు.
మరి ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల్లో భారీ అంచనాలు ఉన్న పాన్ ఇండియన్ మూవీ ”సలార్”( Salaar ).సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ రేపు గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.ఈ క్రమంలోనే సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఈ కొద్దిగంటలు కూడా ఫ్యాన్స్ వెయిట్ చేయలేక పోతున్నారు.

ఇక ఈ సినిమా రేపు రిలీజ్ అవుతున్న క్రమంలో ఆయన బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ సలార్ సినిమా కోసం బెస్ట్ విషెష్ తెలిపారు.ఈయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ తన స్నేహితుడి సినిమా హిట్ కావాలని కోరుకున్నారు.ఈయన ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని.
బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఎదురు చూస్తున్న అంటూ చెప్పుకొచ్చారు.అలాగే టీమ్ అందరికి బెస్ట్ విషెష్ అంటూ తెలిపారు.

కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమా డిసెంబర్ 22న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.మరి ఈ మూవీ ఎలాంటి ఓపెనింగ్స్ కొల్లగొడుతుందో చూడాలి.







