యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ ఆగస్టు లో సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉందని అందుకే కాస్త ఆలస్యంగానే సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఆ మద్య ప్రకటించారు.2023 సంవత్సరం జనవరి నెలలో ఆదిపురుష్ సినిమా విడుదల కాబోతుంది.అంటే ఇంకా ఏడు నెలల సమయం ఉంది.
ఈ ఏడు నెలల సమయం కూడా ఆది పురుష్ కోసం వెయిట్ చేయాల్సిందే.ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ గ్రాఫిక్స్ మూవీ ఆదిపురుష్ అంటూ ఆ మద్య యూనిట్ సభ్యులు ప్రకటించారు.
దాదాపుగా 500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ కు మెజార్టీ బడ్జెట్ ఖర్చు చేశారట.
మొత్తం గ్రీన్ మ్యాట్ లోనే సినిమాను షూట్ చేశారు.
ఇప్పుడు అద్బుతమైన విజువల్ వండర్ గా మార్చే పని జరుగుతోంది.ప్రతి ఒక్క షాట్ కూడా ఒక విజువల్ వండర్ అన్నట్లుగా ఉంటుందని.
తప్పకుండా సినిమా ప్రతి ఒక్కరిని కూడా సరికొత్త లోకంకు తీసుకు వెళ్తుందని అంటున్నారు.ప్రభాస్ ను ఈ సినిమా లో పది అడుగుల ఆజానుబాహుడిగా చూపించబోతున్నారట.

అద్బుతమైన టెక్నాలజీతో ఇప్పటికే 65 శాతం వరకు గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేసి సినిమా ను రెడీ చేశారట.ఈ అయిదు ఆరు నెలల్లో మొత్తం పూర్తి చేస్తారని తెలుస్తోంది.జనవరిలో సినిమాను విడుదల చేయబోతున్న నేపథ్యంలో అక్టోబర్ నుండి సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారట.రెండు నెలల పాటు దేశ వ్యాప్తంగా ఆది పురుష్ టీమ్ చక్కర్లు కొట్టి.
విదేశాల్లో కూడా ఆదిపురుష్ సినిమాను విడుదల చేసేందుకు అక్కడ కూడా ప్రమోషన్స్ చేయబోతున్నారట.







