ప్రభాస్ అనగానే పాన్ ఇండియన్ స్టార్ అనే ఇమేజ్ పడిపోయింది.అయితే ఒకప్పుడు ప్రభాస్ కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే సుపరిచితం.
బాహుబలి ముందు ప్రభాస్ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్స్ చాలానే చేసారు.డార్లింగ్ వంటి సినిమాతో ట్రెండీ స్టైలిష్ లుక్స్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేసాడు.
అయితే బాహుబలి తర్వాత మళ్ళీ అలాంటి ట్రెండీ లుక్ లో ప్రభాస్ ను చూడలేక పోతున్నారు అభిమానులు.ఇప్పటి వరకు డైనోసార్ ప్రభాస్ ను చూసిన ఫ్యాన్స్ ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ ను చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
మరి ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో మారుతి దర్వకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అలానే ఉండబోతుంది.
ఇటీవలే ప్రభాస్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో భారీ యాక్షన్ ‘‘సలార్”( Salaar ) చేయగా ఇది సూపర్ హిట్ అయ్యింది.ఇక ఈ సినిమా తర్వాత ప్రజెంట్ నాగ్ అశ్విన్ తో కల్కి( Kalki 2898 AD ) చేస్తున్నాడు.దీంతో పాటు మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
మారుతి సినిమా నుండి పొంగల్ కానుకగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవలే కన్ఫర్మ్ చేసారు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రభాస్ ట్రెండీ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారని టాక్.అంతేకాదు ఆడియెన్స్ కు కూడా కిక్ ఇచేలా ఈ మూవీలో ప్రభాస్ లుక్స్ అండ్ స్టైల్ అదరగొట్టనుందని సమాచారం.చూడాలి ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ అండ్ ఎనర్జీ ఏ లెవల్ లో ఉంటుందో.
ఇక ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై జి విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా మాళవిక మోహనన్ తో పాటు నిధి అగర్వాల్ ( Malavika Mohanan Nidhhi Agerwal ) కూడా నటించ బోతున్నట్టు సమాచారం.