ఆదిపురుష్ ( Adipurush )సినిమాపై ఎన్ని వివాదాలు వచ్చినా.సినిమా ఓవరాల్ గా లాస్ తెచ్చేలా కనిపిస్తున్నా సినిమా మాత్రం ప్రభాస్ కి మంచే చేసిందని చెప్పొచ్చు.
అలా ఎందుకు అంటే పాన్ ఇండియా హీరో ప్రభాస్ స్టామినా ఏంటో ఒక ఆధ్యాత్మిక కథతో కూడా చాటి చెప్పాడు.ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ప్రభాస్( Prabhas ) కి ఎంత కనెక్ట్ అయ్యారో ఈ సినిమాకు అక్కడ వస్తున్న వసూళ్లు చూసి అర్ధం చేసుకోవచ్చు.
బాహుబలి తో బాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరైన ప్రభాస్ సాహో, రాధే శ్యాం లతో కూడా నార్త్ ఆడియన్స్ ని అలరించాడు.
అయితే కమర్షియల్ గా బాహుబలి ( Baahubali)తర్వాత ఏ ఒక్కటి ప్రాఫిట్స్ తేలేదు కానీ ప్రభాస్ ఆదిపురుష్ మాత్రం మరోసారి అతని క్రేజ్ చూపించి అతని కెరీర్ కి కలిసి వచ్చేలా చేసిందని చెప్పొచ్చు.
సినిమా ఇలాంటి టాక్ తెచ్చుకుంది అంటే అది కేవలం ఓం రౌత్ వల్లే అని డిక్లేర్ చేశారు ఆడియన్స్.సో మొత్తానికి ప్రభాస్ ఆదిపురుష్ తో మరోసారి తన సత్తా చాటి ప్రేక్షకులను మెప్పించాడు.
ఈ సినిమాలో సీతగా నటించిన కృతి సనన్ తో ప్రభాస్ మరో సినిమా జోడీ కడితే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.