యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్( Om Rauth ) దర్శకత్వంలో హిందీ మరియు తెలుగు లో రూపొందిన చిత్రం ఆదిపురుష్.ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
రికార్డు స్థాయి బడ్జెట్ తో ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ గ్రాఫిక్స్ మూవీగా రూపొందిస్తున్నట్లుగా దర్శక నిర్మాతలు పేర్కొన్నారు.తీరా టీజర్ ని చూసిన తర్వాత ఇలా చేశారు ఏంటి అంటూ అంతా పెదవి విరిచారు.

చిన్న పిల్లల సినిమాల సినిమాల యొక్క గ్రాఫిక్స్ ఇంత కంటే ఉత్తమంగా ఉంటాయి.అలాంటిది మీరు ఎందుకు ఆదిపురుష్( Adipurush ) ను ఇంత నాసిరకంగా చేశారు అంటూ విమర్శలు చేసిన వారు చాలా మంది ఉన్నారు.అయిదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కు కనీసం వంద కోట్ల వసూళ్లు కూడా వస్తాయో లేదో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.హిందీ మరియు తెలుగు లో ఈ సినిమా పై ఉన్న అంచనాలు టీజర్ విడుదల తర్వాత మొత్తం పోయాయి.
కానీ తాజాగా ట్రైలర్ విడుదల అయిన తర్వాత పరిస్థితి మారి పోయింది.

అప్పుడు వంద కోట్ల వసూళ్లు రావు అన్నవారు ఇప్పుడు వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడం ఖాయం అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.చిన్న పిల్లల సినిమాల గ్రాఫిక్స్ అంటూ ఎద్దేవ చేసిన వారు ఇప్పుడు ట్రైలర్ విడుదల అయిన తర్వాత అద్భుతం అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.ఆహా ఓహో అంటూ ట్రైలర్ ను ప్రమోట్ చేస్తున్నారు.
విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఆదిపురుష్ సినిమా యొక్క సత్తా ఏంటి అనేది దీంతో తేలిపోయింది.అయిదు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆదిపురుష్ సినిమా ఇప్పుడు వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడంతో పాటు ఇతర మొత్తం బిజినెస్ కలిసి పదిహేను వందల కోట్ల బిజినెస్ చేసినా ఆశ్చర్యం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
రామాయణంను కొత్తగా చూడబోతున్నందుకు ప్రేక్షకులు ఆతృతతో ఉన్నారు.







