యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) హీరోగా రూపొందిన ఆదిపురుష్ ( Adipurush ) ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓం రౌత్ ( Om raut )దర్శకత్వంలో రూపొందిన ఆదిపురుష్ సినిమా కి మిశ్రమ స్పందన వచ్చింది.
సినిమా కి దాదాపుగా అయిదు వందల కోట్ల వసూళ్లు నమోదు అయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.సినిమా విడుదల అయ్యి నాలుగు వారాలు అయ్యిందో లేదో అప్పుడే సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ప్రచారం మొదలు అయ్యింది.
ఆదిపురుష్ సినిమా యొక్క ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ ప్రస్తుతం అభిమానులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఆసక్తిగా ఎదురు చూసేలా చేసింది.

ఆ మధ్య సినిమా విడుదల సమయంలో ఆదిపురుష్ సినిమా ను ఎట్టి పరిస్థితుల్లో థియేట్రికల్ స్క్రీనింగ్ అయిన 50 రోజుల తర్వాత మాత్రమే విడుదల చేస్తాం అంటూ ప్రకటించారు.కానీ ఇప్పుడు ఆదిపురుష్ మేకర్స్ మాట తప్పుతున్నట్లుగా తెలుస్తోంది.ఆదిపురుష్ యొక్క హంగామా థియేటర్లలో లేదు.
కనుక ఓటీటీ లో ఇప్పుడే స్క్రీనింగ్ చేస్తే అన్ని విధాలుగా లాభం ఉంటుంది అనే ఉద్దేశ్యంతో మేకర్స్ సినిమా ఓటీటీ కి ప్లాన్ చేస్తున్నారు.ప్రముఖ ఓటీటీ ఈ సినిమా యొక్క స్ట్రీమింగ్ రైట్స్ ను వంద కోట్లకు కొనుగోలు చేసింది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

రేటు విషయం పక్కన పెడితే అతి త్వరలోనే సినిమా యొక్క స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.భారీ అంచనాల నడుమ రూపొందిన ఆదిపురుష్ సినిమా లో ప్రభాస్ రాముడిగా కనిపించాడు.సీత పాత్ర లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ( Kriti Sanon )నటించింది.ఇక విలన్ గా రావణ్ పాత్ర లో సైఫ్ అలీ ఖాన్ ను చూపించారు.
మొత్తానికి ఈ సినిమా ఓ రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుంటుందని నిరాశ పర్చిన నేపథ్యం లో అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి సినిమా లు థియేట్రికల్ రిలీజ్ లో ఫ్లాప్ అయినా కూడా ఓటీటీ లో విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.







