టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) వరుస సినిమాలతో బిజీగా ఉండగా బాహుబలి, బాహుబలి2 సినిమాలతో ప్రభాస్ కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చిందనే సంగతి తెలిసిందే.అయితే ప్రభాస్ బాహుబలి సినిమాకు ముందే బాలీవుడ్ సినిమాలో( Bollywood Movie ) నటించారనే విషయం చాలా తక్కువమందికి తెలుసు.
పాన్ ఇండియా హీరోగా గుర్తింపు రాకముందే ప్రభాస్ యాక్షన్ జాక్షన్( Action Jackson ) అనే సినిమాలో నటించారు.ఈ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ లో నటించారు.
కొన్ని సెకన్ల పాటు ఈ సినిమాలో ప్రభాస్ కనిపించి మెప్పించారు.ఈ సినిమా మరీ బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు.ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం కల్కి సినిమాతో( Kalki ) ప్రభాస్ బిజీగా ఉన్నారు.ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఒకింత గందరగోళం నెలకొంది.
మే నెల 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావడానికి ఎన్నికల షెడ్యూల్ ఇబ్బందిగా మారింది.ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరుగుతుండటంతో కల్కి రిలీజ్ డేట్ మారడం ఖాయమేనని తెలుస్తోంది.

ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తుండగా ఈ సినిమాలు సక్సెస్ సాధిస్తే ప్రభాస్ రేంజ్ సైతం మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.కల్కి సినిమా రిలీజ్ డేట్ మారితే మాత్రం ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వాయిదా పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.మాస్, క్లాస్ ప్రేక్షకులను మెప్పిస్తున్న ప్రభాస్ కల్కి సినిమాతో పాన్ ఇండియా( Pan India ) రేంజ్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రభాస్ అద్భుతమైన కథలను ఎంచుకుంటూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.ప్రభాస్ సలార్ మూవీ( Salaar ) బాక్సాఫీస్ వద్ద 700 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించి ప్రేక్షకులను మెప్పించింది.యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను సైతం మెప్పించేలా కల్కి మూవీ ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.