అఫిషియల్ : 'బ్రో' నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. పవన్ - తేజ్ కలిసి ఉన్న క్రేజీ పోస్టర్!

Powerful Update On Pawan Kalyan's BRO, Vinodhaya Sitham, Pawan Kalyan, Sai Dharam Tej, BRO, BRO Update,Samuthirakani,Trivikram,Tollywood

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అండ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో”.ఈ మూవీపై ఆడియెన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

 Powerful Update On Pawan Kalyan's Bro, Vinodhaya Sitham, Pawan Kalyan, Sai Dhara-TeluguStop.com

డివోషనల్ ట్రెండీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను వినోదయ సీతం( Vinodhaya Sitham ) అనే తమిళ్ బ్లాక్ బస్టర్ సినిమాను రీమేక్ గా తెరకెక్కుతున్నారు.అయితే ఇది రీమేక్ అయినప్పటికీ ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే అంచనాలు భారీగా పెరిగాయి.

తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు.తమిళ్ లో నటించి తెరకెక్కించిన సముద్రఖని( Samuthirakani ) ఇక్కడ కూడా తెరకెక్కిస్తున్నాడు.అందులోను ఈ స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ చేయి కూడా పడడంతో ఈ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు.ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి పవర్ స్టార్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఆ తర్వాత తేజ్ ఫస్ట్ లుక్ కూడా రాగ దానికి కూడా మాసివ్ రెస్పాన్స్ లభించింది.అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి ఇద్దరినీ కలిపి ఉండే సాలిడ్ పోస్టర్ ను రివీల్ చేయబోతున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.

ఈ ఇద్దరు కలిసి ఉంటే చూడాలని మంచి పోస్టర్ రిలీజ్ చేయమని ఫ్యాన్స్ కోరుతుండగా వీరి కోరికను నెరవేర్చడం కోసం రేపు పోస్టర్ ను రివీల్ చేయబోతున్నారు.

ఈ సాలిడ్ పోస్టర్ మే 29న ఉదయం 10 గంటల 8 నిముషాలకు రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసారు.మరి ఈ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ఎలా ఉంటుందో చూడాలి.ఇక పీపుల్స్ మీడియా బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

అలాగే కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు నటిస్తున్న ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube