అఫిషియల్ : ‘బ్రో’ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. పవన్ – తేజ్ కలిసి ఉన్న క్రేజీ పోస్టర్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అండ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ''బ్రో''.

ఈ మూవీపై ఆడియెన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.డివోషనల్ ట్రెండీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను వినోదయ సీతం( Vinodhaya Sitham ) అనే తమిళ్ బ్లాక్ బస్టర్ సినిమాను రీమేక్ గా తెరకెక్కుతున్నారు.

అయితే ఇది రీమేక్ అయినప్పటికీ ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే అంచనాలు భారీగా పెరిగాయి.

"""/"/ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు.తమిళ్ లో నటించి తెరకెక్కించిన సముద్రఖని( Samuthirakani ) ఇక్కడ కూడా తెరకెక్కిస్తున్నాడు.

అందులోను ఈ స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ చేయి కూడా పడడంతో ఈ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి పవర్ స్టార్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఆ తర్వాత తేజ్ ఫస్ట్ లుక్ కూడా రాగ దానికి కూడా మాసివ్ రెస్పాన్స్ లభించింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి ఇద్దరినీ కలిపి ఉండే సాలిడ్ పోస్టర్ ను రివీల్ చేయబోతున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.

ఈ ఇద్దరు కలిసి ఉంటే చూడాలని మంచి పోస్టర్ రిలీజ్ చేయమని ఫ్యాన్స్ కోరుతుండగా వీరి కోరికను నెరవేర్చడం కోసం రేపు పోస్టర్ ను రివీల్ చేయబోతున్నారు.

"""/"/ ఈ సాలిడ్ పోస్టర్ మే 29న ఉదయం 10 గంటల 8 నిముషాలకు రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసారు.

మరి ఈ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ఎలా ఉంటుందో చూడాలి.ఇక పీపుల్స్ మీడియా బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

అలాగే కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు నటిస్తున్న ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.