డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేసే పవర్ ఫుల్ రెమెడీ మీ కోసం!

సాధారణంగా చాలా మంది మహిళలు డెలివరీ అనంతరం తీవ్రమైన హెయిర్ ఫాల్( Hair fall ) తో బాధపడుతూ ఉంటారు.

ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, శరీరానికి అవసరమయ్యే పోషకాలు అందకపోవడం, పలు రకాల మందుల వాడకం.

ఇందుకు ప్రధాన కారణాలు.ఏదేమైనా జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటే ఏం చేయాలో తెలీక మరింత ఒత్తిడికి లోనవుతుంటారు.

కానీ వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని పాటిస్తే డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే కంట్రోల్ అవుతుంది.

మ‌రి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు బియ్యం( Rice ) కడిగిన నీళ్లు పోసుకోవాలి.అలాగే రెండు స్పూన్లు అవిసె గింజలు, ఒక కప్పు తరిగిన కలబంద ( Aloe vera )ముక్కలు వేసి ఉడికించాలి.పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికిస్తే వాటర్ జెల్లీ స్ట్రక్చర్ లోకి మారుతుంది.

అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని జెల్ ను సపరేట్ చేసుకోవాలి.చల్లారిన తరువాత ఈ జెల్ లో ఒక ఎగ్ వైట్ ( Egg white )మరియు వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే జుట్టుకు చక్కని పోషణ అందుతుంది.

హెయిర్ ఫాల్ సమస్య( Hair fall problem ) కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో జుట్టు ఎదుగుదల మెరుగుపడుతుంది.

పొరుగింటి వ్యక్తిని చెప్పుతో కొట్టిన లేడి పోలీస్... వీడియో వైరల్...
ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 

ఫలితంగా మీ జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.అలాగే ఈ రెమెడీ వల్ల హెయిర్ సిల్కీగా, షైనీ గా సైతం మెరుస్తుంది.

Advertisement

తాజా వార్తలు