తెలుగు చలన చిత్ర పరిశ్రమకి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పవర్ స్టార్ ఎలాగో, కన్నడ సినీ పరిశ్రమకి పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.( Puneeth Rajkumar ) కంఠీరవ రాజ్ కుమార్ గారి ఆఖరి కొడుకు ఈయన.
కన్నడ సినిమా ఇండస్ట్రీ లో అందరూ ఈయనని ‘అప్పు’( Appu ) అని ప్రేమగా పిలుస్తారు.హిట్లు, సూపర్ హిట్లు మరియు ఇండస్ట్రీ హిట్లతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న పునీత్ రాజ్ కుమార్ సినిమా వస్తుందంటే కర్ణాటక మొత్తం పండగ వాతావరణం నెలకొంటుంది.
ఆయనకీ వచ్చేంత ఓపెనింగ్ కలెక్షన్స్ కర్ణాటక లో ఏ హీరోకి కూడా రాదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.అలాంటి స్టార్ హీరో అకస్మాత్తుగా రెండేళ్ల క్రితం జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చి మరణించిన విషయం యావత్తు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని శోకసంద్రం లోకి నెట్టేసింది.
చనిపోయిన ముందు రోజు కూడా తన అన్నయ్య శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘భజరంగి 2 ‘ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి, సరదాగా చిందులు వేసాడు.

పక్కరోజు ఉదయం కూడా ఆయనకీ గుండెలో నొప్పిగా ఉండడంతో హాస్పిటల్ కి నడుచుకుంటూ వెళ్లి కార్ లో ఎక్కిన సీసీటీవీ కెమెరా విజువల్స్ ని చూస్తే ఇప్పటికీ మన కళ్ళలో నీళ్లు ఆగవు.అలా కార్ లో సజీవంగా వెళ్లిన మనిషి, సాయంత్రానికి శవం లాగ తిరిగి వచ్చాడు.ఆయన కుటుంబం తో పాటుగా కోట్లాది మంది అభిమానులు గుండెలు బాదుకుంటూ ఏడ్చేలా చేసాడు.
అయితే పునీత్ రాజ్ కుమార్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాడు, ఎంతో బిడ్డలను చదివించాడు, అనాదులను మరియు వృద్ధులను కూడా దగ్గరకి తీసుకున్నాడు.చివరికి చనిపోయిన తర్వాత తన నేత్రాలను కూడా దానం చేసి గొప్ప మనసు ఉన్న మనిషిగా నిలిచాడు.
ఆయన సినిమాలు మన తెలుగు ప్రేక్షకులు ఒక్కటి కూడా చూడకపోయినా ఆయన చేసిన ఈ మంచి పనులను చూసి ‘అయ్యో దేవుడి లాంటి మనిషిని కోల్పోయామే’ అని బాధ పడ్డారు.ఇప్పటికీ ఆయనని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు ప్రేక్షకులు.

ఇది ఇలా ఉండగా పునీత్ రాజ్ కుమార్ మన టాలీవుడ్ హీరోలతో కూడా ఎంతో స్నేహం గా ఉండేవాడు.రామ్ చరణ్ , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ మరియు ప్రభాస్ వంటి వారు ఆయనకీ బెస్ట్ ఫ్రెండ్స్.పవన్ కళ్యాణ్ ని కూడా రెండు మూడు సార్లు ఆయన కలిసాడు, జానీ మూవీ షూటింగ్ సమయం లో పవన్ కళ్యాణ్ ని రామోజీ ఫిలిం సిటీ లో కలిశానని, ఆయన నా చిన్నప్పటి సినిమాల గురించి ప్రత్యేకించి మాట్లాడి నన్ను మెచ్చుకున్నాడని పునీత్ రాజ్ కుమార్ అప్పట్లో ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.అయితే పునీత్ రాజ్ కుమార్ కోసం పవన్ కళ్యాణ్ ఒక గొప్ప పని చేసాడనే విషయం చాలా మందికి తెలియదు.
ఆయన ఇన్ని సేవ కార్యక్రమాలు చేస్తున్నాడని, ఆయన చనిపోయినప్పుడు మాత్రమే తెలిసింది.కుటుంబ సబ్యులకు కూడా వీటి గురించి తెలియదు.పవన్ కళ్యాణ్ కూడా అందరితో పాటుగానే తెలుసుకున్నాడట, పునీత్ రాజ్ కుమార్ నడుపుతున్న స్కూల్ కి తనవంతుగా 30 లక్షల రూపాయిలు విరాళం ఇచ్చినట్టు సమాచారం.ఈ విషయాన్నీ ఎవరికీ తెలియకుండా చేసినప్పటికీ బయటపడిపోయింది.