టాలీవుడ్ ప్రేక్షకులు గత నెల రోజులుగా ఒకే విషయం గురించి ఆలోచిస్తున్నారు.సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్.
రాధే శ్యామ్.భీమ్లా నాయక్.
సర్కారు వారి పాట సినిమా లు వస్తున్నాయి.వాటిలో ఏది చూడాలి.
ఈ నాలుగు సినిమా లు ఒకే సారి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచిస్తున్న సమయంలో అనూహ్యంగా సర్కారు వారి పాట సినిమా ను పక్కకు తొలగించేశారు.ఏప్రిల్ 1న సర్కారు వారి పాట సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా తేదీ మార్చి కొత్త తేదీని ప్రకటించారు.
ఇప్పుడు పోటీ ప్రథానంగా ఆ మూడు సినిమాల మద్య ఉండబోతుంది.
ఆ మూడు సినిమా లు అదుగో ఇదుగో అంటూ గత ఏడాది కాలంలో వాయిదాలు పడి ఎట్టకేలకు విడుదల అయ్యేందుకు సిద్దం అయ్యాయి.
ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా నాలుగు ఏళ్ల నుండి మురిపిస్తుంది.ఈ మూడు సినిమాలు ఒకే సారి బాక్సాఫీస్ వద్దకు వస్తే థియేటర్ల సమస్య ఉంటుంది.
ఆర్ ఆర్ ఆర్ ను పూర్తిగా తీయాల్సి వస్తుంది.కనీసం మూడు వారాలు అయినా ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రభంజనం కొనసాగుతుందని అంటున్నారు.
అలాంటిది రెండు వారాలకే థియేటర్ల నుండి తొలగిస్తే చాలా నష్టం వస్తుందని అంటున్నారు.
దిల్ రాజు థియేటర్ల సర్దు బాటు విషయంలో తల పట్టుకున్నాడు.

ఈ సమయంలో అల్లు అరవింద్ మరియు దిల్ రాజు లు కలిసి భీమ్లా నాయక్ ను ఒప్పించేందుకు రాజీ ప్రయత్నాలు మొదలు పెట్టారట.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వారి రాజీ ప్రయత్నాలు సఫలం అయ్యాయి అంటున్నారు.సంక్రాంతికి వచ్చేందుకు సిద్దం అయిన భీమ్లా నాయక్ కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.రికార్డు స్థాయి వసూళ్లు నమోదు కావాలంటే మంచి రిలీజ్ డేట్ కావాలి.

అందుకే భీమ్లా నాయక్ కు ఆలస్యంగా విడుదల చేయడం మంచిదే అంటూ కొందరు అభిమానులు ఇది గుడ్ న్యూస్ అనుకుంటూ ఉంటే మరి కొందరు మాత్రం సంక్రాంతికి భీమ్లా నాయక్ వస్తుందని ఆశపడితే ఇలా జరిగింది ఏంటీ అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.వారు మాత్రం ఇది బ్యాడ్ న్యూస్ అనుకుంటున్నారు.కొత్త విడుదల తేదీ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.ఆర్ ఆర్ ఆర్ కు ఇది పెద్ద ఊరట అంటున్నారు.







