బొగ్గు స్కాం మనీలాండరింగ్ కేసులో పొట్లూరి వరప్రసాద్( Potluri Vara Prasad ) సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు.
బొగ్గు కుంభకోణం మనీలాండరింగ్ కేసు( Coal Scam and Money Laundering )లో పొట్లూరిని విచారించేందుకు జనవరి 30వ తేదీన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పొట్లూరి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు( Supreme Court ) తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేయకుండా సుప్రీంకోర్టుకు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.అనంతరం ఈడీ అభిప్రాయం తెలుసుకున్న తరువాతే నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది.దీనిపై తదుపరి విచారణ రెండు వారాల అనంతరం చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.