నిద్ర సరిగ్గా రావట్లేదా..?! అయితే వీటి వాసన పీల్చండి, ఇట్లే నిద్రపొండి..!

మన వంట గదిలో ఉండే దినుసుల్లో గసగసాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి.చికెన్ వండాలన్న,మటన్ వండాలన్న కానీ గసగసాల పేస్ట్ ఉండి తీరాలిసిందే.

అవి వేస్తే గాని కూరకి మంచి టేస్ట్ రాదు.ఒక్క కూరల్లో మాత్రమే గసగసాలు వాడతాము అని అనుకుంటే మాత్రం పొరపాటు పడినట్లే.

ఎందుకంటే గసగసాలు మనకి నిద్రలేమి సమస్య నుండి దూరం చేస్తాయి.ఆవును మీరు విన్నది నిజమే.

గసగసాలను ఉపయోగించి ఈ కింది చెప్పిన టిప్స్ పాటిస్తే మీరు హాయిగా నిద్ర పోవచ్చు తెలుసా.అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.!! ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరు ఎదుర్కునే ప్రధాన సమస్యల్లో నిద్రలేమి సమస్య ఒకటి అని చెప్పవచ్చు.

Advertisement

మనిషికి తిండి ఎంత ముఖ్యమో, సమయానికి నిద్ర పోవడం కూడా అంతే ముఖ్యం.నిద్ర లేమి సమస్యను తేలికగా తీసుకుని నిర్లక్ష్యం చేస్తే మాత్ర ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

కొంత మందికి మంచం మీద ఎంత సేపు పనుకున్నాగాని నిద్ర రాదు.మరి కొంత మందికి ఎంతసేపు కళ్ళు మూసుకున్నా గాని నిద్ర పట్టదు.అలాంటి వారికి గసగసాలు బాగా ఉపయోగపడతాయి.

మీరు చేయాలిసిందల్లా ఒక్కటే గసగసాలను పొయ్యి మీద పెట్టిన పాన్ లో దోరగా వేగించాలి.తరువాత వాటిని ఒక పలుచని వస్త్రంలో వేసి మూట కట్టి పడుకునే సమయంలో వాటి వాసన గనక పీల్చితే మంచి నిద్ర పడుతుంది.అలాగే మీరు నిద్రకు ఉపక్రమించే ముందు ఒక అరగ్లాస్ పాలల్లో అరస్పూన్ గసగసాలను వేసి పొయ్యి మీద పెట్టి కొంచెం సేపు మరిగించాలి.

అలా మరిగించిన పాలను గోరు వెచ్చగా ఉన్నప్పుడు రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తాగితే మీకు మంచి నిద్ర పడుతుంది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు