పోప్లర్ చెట్లను ఇలా పెంచితే రైతులకు లక్షల్లో ఆదాయం

పోప్లర్ చెట్లను రైతులు ఎంతో సులువుగా పెంచ‌వ‌చ్చు.పోప్లర్ చెట్ల పెంప‌కానికి ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నుండి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం.

 Poplar Tree Farming , Poplar Tree , Farmers , Direct Sunlight , For Paper Making, Light Plywood, Chopsticks, Boxes, Matches,income-TeluguStop.com

ఈ మొక్క‌ల ఎదుగుద‌ల‌కు రైతులు ప్రత్యక్ష సూర్యకాంతి ఉండేలా చూసుకోవాలి.ఈ పోప్లర్ చెట్ల క‌ల‌ప‌ను కాగితం తయారీకి, లైట్ ప్లైవుడ్, చాప్ స్టిక్స్, పెట్టెలు, అగ్గిపెట్టెలు మొదలైన వాటికి ఉపయోగిస్తారు.

ఈ పోప్ల‌ర్ మొక్కను కొనుగోలు చేయాలనుకుంటే.దానిని డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ యూనివర్శిటీ, గోవింద్ వల్లభ్ పంత్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ, మోడీపూర్‌లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదలైన చోట్ల‌ నుండి సేక‌రించ‌వ‌చ్చు.

 Poplar Tree Farming , Poplar Tree , Farmers , Direct Sunlight , For Paper Making, Light Plywood, Chopsticks, Boxes, Matches,income-పోప్లర్ చెట్లను ఇలా పెంచితే రైతులకు లక్షల్లో ఆదాయం-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రైతులు ఈ మొక్క‌ల‌ను ఇష్టారీతిన‌ నాటకూడదు.ఎందుకంటే వీటిని స‌క్ర‌మంగా నాట‌క‌పోతే బలంగా పెరగవు.పోప్ల‌ర్ మొక్కను చెట్టు నుండి వేరు చేసిన నాలుగు రోజుల్లో నాటాలి.ఏదైనా వ్యవసాయం చేసే ముందు రైతులు దాని ద్వారా వచ్చే ఆదాయంపై మొదటి శ్రద్ధ చూపుతారు.పోప్ల‌ర్ చెట్ల దుంగలను క్వింటాల్‌కు రూ.700 నుంచి రూ.800 చొప్పున విక్రయిస్తున్నారు.ఒక చెట్టు దుంగ రూ.2000కి అమ్ముడవుతోంది.ఇంత‌టి ఆదరణ పొందిన చెట్లను సక్రమంగా నాటి,పెంచినట్లయితే ఒక హెక్టారులో 250 చెట్ల వరకు పెంచవచ్చు.

ఒక చెట్టు ఎత్తు భూమి నుండి దాదాపు 80 అడుగుల ఎత్తు వ‌రకూ ఉంటుంది.ఒక హెక్టారులో ఈ మొక్క‌ల‌ను పెంచ‌డం ద్వారా ఆరు నుండి ఏడు లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube