మల్టీప్లెక్స్‌లలో పాప్ కార్న్ ఎక్కువగా అమ్ముతారు.. ఎందుకంటే?

ఈ తంతు అందరికీ తెలిసినదే.వీకెండ్‌ కదాని ఫ్యామిలీతో సరదాగా సినిమా ఎంజాయ్‌ చేద్దామని ఏ మల్టీప్లెక్స్‌కో వెళ్తే అక్కడ మనకు మరో సినిమా చూపిస్తున్నారు.

 Popcorn Is Sold More In Multiplexes.. Because, Multiplex, Pop Corn, Costly, Movies, Too Costly, Reason,-TeluguStop.com

అదేనండి ఇంటర్వెల్‌లో పిల్లలు సరదాపడుతున్నారని పాప్ కార్న్ కొనిపెడితే మన సరదా తీరిపోతుంది.ఇకపోతే థియేటర్లలో అన్ని తరగతుల వారికి వారి స్థాయిని బట్టి టికెట్ల ధరలు అనేవి అందుబాటులో ఉంటాయి.

సినిమా హాళ్ల క్యాంటీన్లలో విక్రయించే తినుబండారాలకు మాత్రం ఈ సూత్రం వర్తించదు ఎందుకనో? సినిమాకి వెళ్తే చాలు తమకు నచ్చిన రేట్లేసి చుక్కలు చూపిస్తున్నారు.

 Popcorn Is Sold More In Multiplexes.. Because, Multiplex, Pop Corn, Costly, Movies, Too Costly, Reason,-మల్టీప్లెక్స్‌లలో పాప్ కార్న్ ఎక్కువగా అమ్ముతారు.. ఎందుకంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవలసింది అక్కడ అమ్మేటువంటి పాప్ కార్న్ గురించి.

ఒక పది రూపాయిలు విలువ వుండే పాప్ కార్న్ దాదాపు 70 రూపాయలకు అమ్ముతూ వుంటారు.రేట్లు తగ్గించాలని ప్రేక్షకులు డిమాండ్‌ చేస్తున్నా వారికి పట్టదు.ఈ తరుణంలో సినిమా థియేటర్‌లో ముఖ్యంగా పాప్‌కాన్‌ కాస్ట్లీపై పీవీఆర్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజిండ్‌ డైరెక్టర్‌ అజయ్‌ బిజ్లీ తాజాగా స్పందించారు.థియేటర్‌లలో పెరిగిపోతున్న శ్నాక్స్‌ ధరల్ని వ్యతిరేకిస్తున్న వినియోగదారుల్ని నిందించలేం.

అయితే, మనదేశంలో సింగిల్‌ స్క్రీన్‌ నుంచి మల్టీఫ్లెక్స్‌ల వరకు ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ ధరలలో ఎటువంటి మార్పు ఉండదని బిజిలీ చెప్పారు.

అసలు విషయం ఏమంటే… థియేటర్ నిర్వహణ ఖర్చుల కోసం మల్టీప్లెక్స్‌లోని స్నాక్స్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు.మనదేశంలో ఫుడ్‌ & అండ్‌ బేవరేజెస్‌ మార్కెట్‌ రూ.1500కోట్లుగా ఉంది.మల్టీప్లెక్స్‌లలో ఎక్కువ స్క్రీన్‌ల కారణంగా ప్రొజెక్షన్ రూమ్‌లు,సౌండ్ సిస్టమ్‌ల అవసరం ఎక్కువే.కాబట్టే ఖర్చులు “4 నుండి 6 రెట్లు” పెరుగుతాయని అంటున్నారు.ఫోయర్‌లు కూడా ఫుల్ ఏసీతో ఉండడంతో ఎయిర్ కండిషనింగ్ అవసరం కూడా పెరిగిందన్నారు.కాగా ఈ ఏడాది ప్రారంభంలో పీవీఆర్‌- ఐనాక్స్ మెర్జ్‌ అయిన విషయం తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube