టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్( Poonam Kaur ) సోషల్ మీడియాలో ఏ ట్వీట్ చేసినా ఆ ట్వీట్ హాట్ టాపిక్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తాజాగా పూనమ్ కౌర్ ఒక టాలీవుడ్ స్టార్ హీరోను టార్గెట్ చేసిందంటూ ఒక ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆ స్టార్ హీరో అభిమానులకు ట్వీట్ కోపం తెప్పించగా వాళ్లు పూనమ్ కౌర్ పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.ఆ ట్రోల్స్ ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతున్నాయి.

పూనమ్ కౌర్ ఆ ట్వీట్ లో స్త్రీల సమస్యల( Women issues )పై ఎంతో శ్రద్ధ ఉన్నట్టు గొంతు చించుకుని అరుస్తున్నవీళ్లు మహిళా రెజ్లర్ల కష్టాల గురించి కనీసం ఒక్క మాటైనా మాట్లాడలేదని పూనమ్ కౌర్ పేర్కొన్నారు.స్వలాభం, సౌకర్యాలు ముఖ్యం అని భావించే కుహనా నాయకులతో జాగ్రత్తగా ఉండాలని ఆమె చెప్పుకొచ్చారు.పూనమ్ కౌర్ అకస్మాత్తుగా చేసిన ట్వీట్ సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనం కావడం గమనార్హం.
హ్యాష్ ట్యాగ్ ఆంధ్రప్రదేశ్ అంటూ పూనమ్ కౌర్ ట్వీట్( Poonam Kaur Tweet ) చేయడంతో ఏపీ రాజకీయాలను టార్గెట్ చేస్తూ ఆమె ట్వీట్ చేసిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
పూనమ్ కౌర్ బహిరంగంగా ఏం చెప్పకపోయినా ఆమె చేసే ట్వీట్లు హాట్ టాపిక్ అవుతుంటాయి.కొన్నిరోజుల క్రితం వైఎస్సార్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేయడం ద్వారా పూనమ్ కౌర్ వార్తల్లో నిలిచారు.

పూనమ్ కౌర్ అనవసర వివాదాలకు దూరంగా ఉంటే మంచిదని వివాదాలలో జోక్యం చేసుకోవడం ద్వారా ప్రజల్లో కొన్ని సందర్భాల్లో చులకన అయ్యే అవకాశం ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పూనమ్ కౌర్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారనే సంగతి తెలిసిందే.మరోసారి పూనమ్ కౌర్ ఏపీ రాజకీయాల్లో( AP Politics ) హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.








