సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పూనమ్ కౌర్ రివ్యూ.. బావ సినిమా హిట్ అంటూ?

సాధారణంగా ఈ మధ్య కాలంలో యునానిమస్ గా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమాలేవీ లేవనే చెప్పాలి.

కొన్ని సినిమాలకు భారీస్థాయిలో కలెక్షన్లు వచ్చినా ఆ సినిమాలకు క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.

అయితే భీమ్లా నాయక్ సినిమాకు మాత్రం యునానిమస్ గా పాజిటివ్ టాక్ వచ్చింది.భీమ్లా నాయక్ సినిమా సక్సెస్ సాధించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

భీమ్లా నాయక్ కలెక్షన్ల విషయంలో రికార్డులను క్రియేట్ చేసే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే తాజాగా ఈ సినిమాకు పూనమ్ కౌర్ రివ్యూ ఇచ్చారు.

పూనమ్ కౌర్ ఎవరితోనో చేసిన చాట్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.చాట్ లో భీమ్లా నాయక్ పేరు లేకపోయినా ఈరోజు విడుదలైన సినిమా భీమ్లా నాయక్ మాత్రమే అనే సంగతి తెలిసిందే.

Advertisement

పూనమ్ కౌర్ చాట్ లో మ్యాడీ అనే వ్యక్తితో చాట్ చేశారు.

ఆ వ్యక్తి సినిమాకు వచ్చా అక్క.బావ సినిమా.8ఏఎం అని పెట్టగా పూనమ కౌర్ సిగ్గు పడుతున్న ఎమోజీస్ ను షేర్ చేసి హానెస్ట్ రివ్యూ ఇవ్వాలని కోరారు.ఆ తర్వాత అవతలి వ్యక్తి " అక్కా సినిమా హిట్ ట్రస్ట్ మీ.ప్రామిస్ గా చెబుతున్నా అని పేర్కొన్నారు.పూనమ్ కౌర్ పవన్ సినిమా గురించి పాజిటివ్ రివ్యూను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం గురించి జోరుగా చర్చ జరుగుతోంది.

పూనమ్ కౌర్ భీమ్లా నాయక్ సినిమా ఈవెంట్ గురించి కూడా తాజాగా పలు సెన్సేషనల్ ట్వీట్లు చేసి వార్తల్లో నిలిచారు.పూనమ్ కౌర్ పవన్ పేరు డైరెక్ట్ గా ప్రస్తావించకపోయినా పవన్ సినిమాల గురించి, పవన్ కు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉండటం గమనార్హం.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు