దేశం వదిలి వెళ్లిపోవాలనుకున్నా.. ప్రెస్ మీట్ లో నిజాలు బయటపెట్టిన పూనమ్ కౌర్?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తరచూ ఏదో ఒక వార్తతో నిత్యం సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది.

 Poonam Kaur Gets Emotional Nathi Charami Movie Press Meet, Poonam Kaur, Tollywoo-TeluguStop.com

మొదట మాయాజాలం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత వచ్చిన సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.మధ్యలో సరైన సినిమా అవకాశాలు లేకపోవడంతో దాదాపుగా నాలుగేళ్లపాటు ఇండస్ట్రీకు దూరంగా ఉంది.

ఇది ఇలా ఉంటే పూనమ్ కౌర్ తాజాగా ఒక సినిమాలో నటిస్తోంది.అరవింద కృష్ణ, సందేశ్ బురి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం నాతిచరామి.ఈ సినిమాలో పూనమ్ కౌర్ కూడా నటిస్తోంది.ఈ సినిమాకు నాగు గరవ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాను ఏ స్టూడియో 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్ పతాకంపై జై వైష్ణవి కే నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.

ఈ సినిమా మార్చి 10న విడుదల కానుంది.ఈ సందర్భంగా తాజాగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ ప్రెస్ మీట్ లో భాగంగా పూనమ్ కౌర్ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యింది.

Telugu Nathi Charami, Poonam Kaur, Press Meet, Tollywood-Movie

తాను సినిమాలు వదిలేసి పోవాలి అనుకున్నట్లు తెలిపింది.అంతేకాకుండా 2017, 18 లో ఆమె పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోదామని అనుకుందట.కానీ సినిమా తన జీవితాన్ని మార్చేసింది అని చెప్పుకొచ్చింది పూనమ్.

పెళ్లి చేసుకొని దేశం వదిలి యూఎస్ వెళ్ళిపోతాను అని తన తల్లికి చెప్పిందట.కానీ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో రియలైజ్ అయ్యాను అని తెలిపింది.

అంతేకాకుండా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు చాలా కళలు ఉంటాయి.అందులో ప్రత్యేకమైనది పెళ్లి.

ఆ పెళ్లి కళ ను కొందరు చెదరగొట్టారు.కానీ ఇండియన్ కల్చర్ లోనే మహిళలు ఏ విధంగా ధైర్యంగా ఉంటు పోరాడాలి అనేది వుంది.

దాని నుంచి ఆమె ఎంతో స్ఫూర్తి పొందాను అని చెప్పుకొచ్చింది.ఆ విషయంలో తన తల్లి తనకు ఎంతో సపోర్ట్ చేసింది అని తెలిపింది పూనమ్ కౌర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube