టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డేకి( Pooja hedge ) ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో పెద్దగా కలిసి రాలేదని తెలుస్తుంది.ఈమె నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా డిజాస్టర్ కావడంతో ఈమెకు సినిమా అవకాశాలు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి.
ఇలా ఈమె సినిమాలన్నీ కూడా డిజాస్టర్ కావడంతో పూజా హెగ్డేకు అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇలా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ చేసే పూజ హెగ్డే తాజాగా తన బాయ్ ఫ్రెండ్( Boy Friend ) తో కలిసి కనిపించడంతో ఒక్కసారిగా ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పూజా హెగ్డే ఇటీవల కాలంలో ఎక్కువగా తారా సుతారియ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రోహన్ మెహ్రా( Rohan Mehra ) తో ఆ మధ్య బీ టౌన్‌లో బాగానే కనిపించి సందడి చేశారు.దీంతో ఈ ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటే పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి.

ఇకపోతే తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరూ కలిసి కారులో ఉన్నటువంటి ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు.దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఇలా తన ప్రియుడిని ఈమె పరిచయం చేశారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి ఈ వీడియో పాతదా లేకపోతే కొత్తదా అనేది తెలియదు కానీ వీరిద్దరిని ఇలా చూడటంతో ఖచ్చితంగా ఈమె తన బాయ్ ఫ్రెండ్ ని అందరికీ పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది.
ఇక ఈ వీడియో చూసినటువంటి అభిమానులు బ్రోకెన్ హార్ట్ సింబల్ షేర్ చేస్తున్నారు.