మాస్ మహారాజా రవితేజ ( Ravi Teja )- గోపీచంద్( Gopichand Malineni ) మలినేని కాంబో మరోసారి రిపీట్ కాబోతున్న విషయం తెలిసిందే.ఈ మధ్యనే ఈ సినిమా అఫిషియల్ అప్డేట్ వచ్చింది.
గోపీచంద్ మలినేనితో రవితేజ కొత్త మూవీ ప్రకటన రావడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైటింగ్ గా ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు.అంతేకాదు మాసెస్ట్ కాంబో అంటూ పోస్టర్ రిలీజ్ చేయగా ఈ పోస్టర్ ఆకట్టు కుంది.
ఇక ఇప్పుడు ఒక్కొక్క పని పూర్తి చేస్తున్నాడు గోపీచంద్.ఈయన ప్రీ ప్రొడక్షన్ పనులతో ప్రజెంట్ బిజీగా ఉన్నాడు.ఎలాగూ రవితేజ మిగిలిన ప్రాజెక్టులు పూర్తి అయ్యే సరికి టైం పడుతుంది కాబట్టి ఈయన ఈ పనులతో బిజీగా ఉన్నాడు.మరి తాజా టాక్ ప్రకారం హీరోయిన్ ఎంపిక జరిగినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో మాస్ రాజా సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే( Pooja Hegde )ను సెట్ చేయాలని మేకర్స్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం వచ్చింది.
అయితే ఈమె ఒప్పుకుంటుందా లేదా అని అంతా అనుకుంటుండగా తాజాగా పూజా కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వస్తుంది.అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ అతి త్వరలోనే అఫిషియల్ అనౌన్స్ మెంట్ కు సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది.చూడాలి మరి రవితేజ, పూజా హెగ్డే రొమాన్స్ ఎలా ఉండబోతుంది అనేది.
ఇక మైత్రి మూవీస్ బ్యానర్ వారు ఈ కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తూ థమన్ సంగీతం అందిస్తున్నట్టు కూడా ప్రకటించారు.ఈ కాంబో ఇప్పటికే మూడుసార్లు రాగా మూడుసార్లు బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఇక ఇప్పుడు క్రాక్ తర్వాత మరో సినిమాతో వీరు కలిసి పని చేయనున్నారు.ఈసారి ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.
రవితేజ ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘ఈగల్’ సినిమా( Eagle Movie ) చేస్తూ బిజీగా ఉన్నాడు.