భారత్-వెస్టిండీస్( Ind vs WI ) రెండో టెస్ట్ మ్యాచ్లో కాస్త దూకుడుగా ఆడుతున్న వెస్టిండీస్ జట్టును భారత బౌలర్లు కట్టడి చేయడంతో మొదటి ఇన్నింగ్స్ లోనే 255 పరుగులకు వెస్టిండీస్ జట్టు ఆల్ అవుట్ అయింది.దీంతో భారత్ మొదటి ఇన్నింగ్స్ పూర్తయ్యే సమయానికి 183 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఇక రెండో ఇన్నింగ్స్ లో భారత్ 181/2 పరుగుల వద్ద డిక్లేర్ చేసి వెస్టిండీస్ జట్టు ముందు 365 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఈ భారీ లక్ష్య చేదనకు దిగిన వెస్టిండీస్ జట్టు నాలుగో రోజు ఆట పూర్తయ్య సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది.
వెస్టిండీస్ జట్టు విజయం సాధించాలంటే ఇంకా 259 పరుగులు చేయాల్సి ఉంది.వెస్టిండీస్ బ్యాటర్లైన క్రేయిన్ బ్రాత్ వైట్ (28), కిర్క్ మెకంజీ (0)లను రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin ) పెవిలియన్ కు చేర్చాడు.
ప్రస్తుతం క్రీజులో త్యాగ్ నారాయణ్ చందర్ పాల్ (16), బ్లాక్ వుడ్ (20) కోనసాగుతున్నారు.

మొదటి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ బ్యాటర్లను త్వర త్వరగా పెవిలియన్ చేర్చడంలో సిరాజ్( Bowler Siraj ) కీలక పాత్ర పోషించాడు.వెస్టిండీస్ జట్టు మూడవరోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లను కోల్పోయి 229 పరుగులు చేసింది.నాలుగో రోజు ఆట ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు 7.4 ఓవర్లలో కేవలం 26 పరుగులు మాత్రమే చేసి చివరి ఐదు వికెట్లను కోల్పోయింది.ఆ చివరి ఐదు వికెట్లలో ఏకంగా నాలుగు వికెట్లు వరుసగా మహమ్మద్ సిరాజ్ తీయడం విశేషం.

నాలుగో రోజు ఆట ప్రారంభం అవ్వగానే ముఖేష్ కుమార్ బౌలింగ్ లో అథనేజ్ (37) ఆరో వికెట్ గా పెవిలియన్ చేరాడు.ఆ తరువాత మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో జేసన్ హోల్డర్ 15, జోసెఫ్ 4, కీమర్ రోచ్ 4, గాబ్రియెల్ 0, వరుసగా పెవిలియన్ చేరారు.ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండు వికెట్లను కోల్పోయి 181 పరుగులు చేసి డిక్లేర్ చేసి, వెస్టిండీస్ జట్టు ముందు 365 లక్ష్యాన్ని ఉంచింది.







