బన్నీకి కరోనాపై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే మెగా ఫ్యామిలీకి చెందిన పలువురు హీరోలు కరోనా బారిన పడగా తాజాగా బన్నీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.బన్నీకి కరోనా సోకడంతో పుష్ప సినిమా షూటింగ్ పై ఆ ప్రభావం పడనుందని తెలుస్తోంది.

ఆగష్టు 13న పుష్ప మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా వల్ల రిలీజ్ డేట్ మారుతుందేమో చూడాల్సి ఉంది.అయితే బన్నీకి కరోనా సోకడం గురించి పూజా హెగ్డే మాత్రం షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇప్పటికే పూజా హెగ్డే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న పూజా హెగ్డే తనకు కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని త్వరలోనే వైరస్ నుంచి కోలుకుంటానని చెప్పారు.

Advertisement
Pooja Hegde Shocking Comments About Allu Arjun Tests Covid Positive, Pooja Hegde

అయితే తనకు కరోనా సోకిన సమయంలోనే బన్నీకి కరోనా సోకడం గురించి పూజా హెగ్డే స్పందిస్తూ అమూల్యకు బంటూ కంపెనీ ఇస్తున్నట్టు తనకు కనిపిస్తోందని చెప్పుకొచ్చారు.

Pooja Hegde Shocking Comments About Allu Arjun Tests Covid Positive, Pooja Hegde

టేక్ కేర్ అల్లు అర్జున్ అని పోస్ట్ పెట్టారు.అల వైకుంఠపురములో సినిమాలో పూజా హెగ్డే అమూల్య, అల్లు అర్జున్ బంటూ పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.దాదాపు ఒకే సమయంలో ఇద్దరికీ కరోనా సోకడంతో పూజా హెగ్డే అలా పోస్ట్ పెట్టారు.

మరోవైపు అల్లు అర్జున్ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని అతని ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు.అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తుండగా తరువాత ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

పూజా హెగ్డే మాత్రం తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల ఆఫర్లతో బిజీగా ఉన్నారు.అల వైకుంఠపురములో సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో పూజా హెగ్డేకు తెలుగులో ఆఫర్లు పెరుగుతున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఈ హీరోయిన్ కు రష్మిక నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.

Advertisement

తాజా వార్తలు