పూజా హెగ్డే ఖాతాలో అరుదైన రికార్డ్.. అక్కినేని హీరోలతో అలా చేయడంతో?

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న డిమాండ్ హీరోయిన్లలో పూజ హెగ్డే కూడా ఒకరు.

 Pooja Hegde Shares Screen Space With Nagarjuna, Pooja Hegde, Tollywood, Akkineni-TeluguStop.com

టాలీవుడ్ లో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అఖిల్, నాగచైతన్య, అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది పూజ హెగ్డే.టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కోలీవుడ్లలో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే పూజ హెగ్డే ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది.

Telugu Akkineni Heros, Nagarjuna, Pooja Hegde, Tollywood-Movie

హీరో అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించిన పూజ హెగ్డే నాగచైతన్యతో కలిసి ఒక లైలా కోసం సినిమాలో నటించి మెప్పించింది.ఇంకా ప్రస్తుతం నాగార్జునతో కలిసి ఒక కమర్షియల్ యాడ్ లో నటిస్తోంది.శీతల పానీయానికి సంబంధించిన ప్రకటనకు సంబంధించిన షూటింగ్ హైదరాబాదులో తాజాగా పూర్తి అయింది.

అర్జున్ మాలిక్ దర్శకత్వం వహించిన ఈ యాడ్ త్వరలోనే ప్రసారం కానుంది.అయితే ఈ యాడ్ ఫిలిం షూట్ కి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే నాగార్జునతో కలిసి సినిమాలో నటించకపోయినప్పటికీ ఇలా వ్యాపార ప్రకటనలలో స్క్రీన్ షేర్ చేసుకుంది పూజ హెగ్డే.పూజ హెగ్డే అక్కినేని హీరోలు ముగ్గురితో కలిసి నటించినట్లు అయ్యింది.

 ఈ విధంగా అక్కినేని ఫ్యామిలీలో క్రేజ్ ఉన్న ముగ్గురు హీరోలతో కలిసి నటించి పూజా హెగ్డే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

Telugu Akkineni Heros, Nagarjuna, Pooja Hegde, Tollywood-Movie

ఇకపోతే పూజా హెగ్డే కు ఈ మధ్యకాలంలో సినిమాలు అంతగా కలిసి రాలేదు అని చెప్పవచ్చు.ఇటీవల కాలంలో విడుదలైన ఆచార్య, రాధేశ్యామ్, బీస్ట్, సర్కస్ ఇలాంటి సినిమాలు నటించగా ఆ నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పూజ హెగ్డే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది.

మరి మహేష్ బాబు సినిమాతో అయినా పూజా హెగ్డే బౌన్స్ బ్యాక్ అవుతుందేమో చూడాలి మరి.కాగా పూజా హెగ్డే నటించిన సినిమాలు అన్ని వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ఈమెను ఐరన్ లెగ్ అంటూ భారీగా ట్రోల్స్ చేశారు నెటిజన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube