పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా లైగర్.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తి అయినట్టు సమాచారం.
బాక్సింగ్ నేపత్యంలో ఈ సినిమాని పూర్తీ తెరకెక్కించాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో సినిమా మీద అంచనాలు పెంచుతున్నాయి.
ఇదిలా ఉండగా ప్రస్తుతం పూరి జగన్నాథ్, విజయ దేవరకొండ కాంబినేషన్ లో మరొక సినిమా పట్టలేక్కింది.గత కొంతకాలంగా జనగణమన సినిమా గురించి వార్తలు వినిపిస్తున్నాయి.
ఎన్నో రోజుల క్రితం మహేశ్ బాబూ కోసం పూరి జగన్నాథ్ రాసిన కథకి విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించనున్నారు.
అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్ధే పేరు వినిపిస్తోంది.
ప్రతుతం ఈ వార్తలను నిజం చేస్తూ జనగణమన సినిమాలో కథానాయిక పాత్రలో పూజ హెగ్దే పేరుని అధికారికంగా ప్రకటించారు.పూరి జగన్నాథ్ జనగణమన సినిమాను ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ చేశారు.
ఈ సినిమాలో విజయ్ ఆర్మీ ఆఫీసర్ గా ప్రేక్షకులకు కనిపించనున్నాడు.తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
అంతే కాకుండా పూజ హెగ్డేను వెల్కమ్ చెబుతూ పూరి జగన్నాథ్ ఓ వీడియోను రిలీజ్ చేశారు.ఈ వీడియోలో పూరి, ఛార్మి మూవీ మేకింగ్ చూపిస్తూనే పూజాహెగ్డేకు వెల్కమ్ చెప్పారు.

ప్రస్తుతం ఈ జనగణమన సినిమా షూటింగ్ మొదట ముంబైలో మొదలు పెట్టనున్నారు.ముంబైలో విజయ్ పూజా హెగ్డేకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలు షూట్ చేయనున్నారు.ఈ సినిమాని పూరి తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో తెరకెక్కిస్తున్నారు.పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రేక్షకులని ఎంత ఎంటర్టైన్ చేస్తాయి చూడాలి మరి.ఇటీవల పూజ హెగ్డే నటించిన రాధే శ్యామ్, బీస్ట్ సినిమాలు ఫ్లాప్ అవ్వటంతో ఈ అమ్మడు కొంత నిరాశ చెందింది.ఇప్పుడు విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న ఈ సినిమా అయిన పూజ పాపకి హిట్ ఇస్తుందో లేదో చూడాలి మరి.