విజయ్ తో రొమాన్స్ చేయడానికి బుట్టబొమ్మ అందుకే ఒప్పుకుందా?

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా జనగణమన.పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా జనగణమన సినిమా విజయ్ తో చేయబోతున్నట్టు ప్రకటించారు.

 Pooja Hegde Highest-paid Actress In Tollywood, Pooja Hegde, Janaganamana, Vijay-TeluguStop.com

ఈ సినిమా ప్రకటించారో లేదో సెట్స్ మీదకు తీసుకువెళ్లి ఫాస్ట్ గా పూర్తి చేయాలనీ పూరీ ప్లాన్ చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా కంటే ముందే వీరిద్దరి కాంబోలో లైగర్ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ కాకుండానే జనగణమన స్టార్ట్ చేసారు.

ఇక ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ బుట్టబొమ్మ హీరోయిన్ గా నటిస్తుంది అని కన్ఫర్మ్ చేసారు.

ఇప్పటికే ఈమె ఈ సినిమా షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యారు.గత రెండు రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ను ముంబై లో భారీ సెట్టింగ్ వేసిన సెట్ లో స్టార్ట్ చేసారు మేకర్స్.

ఈ ఫస్ట్ షెడ్యూల్ లో పూజా కూడా పాల్గొంది.ఈమె ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలు మాత్రమే చేసింది.ఇక ఇప్పుడు ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కు కూడా సై అంది.

ఈ సినిమాలో విజయ్ తో తొలిసారి రొమాన్స్ చేయబోతుంది.ఇందుకు ఈమె ఏకంగా 5 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు టాక్.4 కోట్లు ఆమెకు అయితే.ఒక కోటి ఆమె సిబ్బంది జీతాలు ఇంకా ఇతర ఖర్చుల కోసం తీసుకుంటుంది అని తెలుస్తుంది.ఈ రేంజులో రెమ్యునరేషన్ అందుకుంటుంది కాబట్టే విజయ్ సినిమాకు ఓకే చెప్పి పవన్ సినిమాని వదులుకుంది ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Telugu Puri Jagannath, Janaganamana, Pawan Kalyan, Pooja Hegde, Poojahegde-Movie

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో పూజా పవన్ కు జోడీగా నటించనుందని మేకర్స్ తెలిపారు.అయితే జనగణమన సినిమాకు అధిక రెమ్యునరేషన్ అందడంతో ఈ సినిమా వదులుకుందని అంటున్నారు.పవన్ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో తెలియదు.ఆ సినిమాకు డేట్స్ ఇచ్చి కూడా వేస్ట్ అందులోను ఇక విజయ్ సినిమాకు అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండడంతో ఈమె విజయ్ తో సై అంది.

ఇలా ఈ బ్యూటీ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube