ఈ మధ్య పూజ హెగ్డే( Pooja Hegde ) పరిస్థితులే తల కిందులు ఉన్నాయి.కానీ ఈ అమ్మడు దూకుడు మాత్రం హై లో ఉంది.
ఇప్పటికే దర్శకులు అవకాశాలు ఇవ్వడానికి వెనకాడుతున్నారు.దాంతో వచ్చిన అవకాశాలని జాగ్రత్తగా కాపాడుకోకుండా తన ప్రవర్తన వల్ల అవి కూడా కోల్పోతుంది.
ఇప్పుడు ఒక స్టార్ హీరో సినిమా విషయంలో కూడా అలా చేయడంతో దెబ్బకు ఆ సినిమాలో ఛాన్స్ కోల్పోయింది అని తెలిసింది.ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.తొలిసారిగా 2010 లో అడుగుపెట్టిన పూజా.2014లో ముకుంద సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.మొదట్లో వరుస ఫ్లాప్ లను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.అలా తర్వాత కొన్ని మూవీస్ చేయగా అలా వైకుంఠపురంలో( ala Vaikunthapuram ) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.
దీంతో చాలామంది దర్శక నిర్మాతలు ఈమెకు తమ సినిమాలలో బాగా అవకాశాలు ఇచ్చారు.

అలా వరుసగా అవకాశాలు అందుకోగా వరుసగా ప్లాప్ లు అందుకొని నిరాశ చెందింది.అది కూడా స్టార్ హీరోల సరసన నటించిన సినిమాలోనే ఫ్లాపులు ఎదుర్కొంది.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్, ఆచార్య( Radheshyam, Acharya ) ఇలా వరుస సినిమాలు బాగా నిరాశపరిచాయి.
ఇక బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా వరుస సినిమాలు చేయగా అక్కడ కూడా ఫ్లాప్ అందుకుంది.దీంతో ఇప్పుడు సక్సెస్ కోసం బాగా ఎదురుచూస్తుంది.
కానీ దర్శక నిర్మాతలు ఈమెను పక్కకు పెట్టేసారు.ఐరన్ లెగ్ అంటూ మరోసారి ముద్రవేశారు.
ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ ఉంటుంది.
తనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో కూడా ముచ్చట్లు పెడుతుంది.
చాలావరకు బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.

అయితే ప్రస్తుతం ఆమె మహేష్ బాబుతో గుంటూరు కారం( gunturkaram ) సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి.ఇక ఇందులో శ్రీలీల కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ మూవీలో త్రివిక్రమ్ పూజా హెగ్డే కంటే శ్రీలీలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారని.
కథ పరంగా కంటెంట్ పరంగా కూడా ఆమెకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ తనను తక్కువ చేశారని తెలిసింది.దీంతో తన కంటే చిన్న హీరోయిన్ కు అంత ప్రిఫెరెన్స్ ఇవ్వడంతో పూజా కోపంతో సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపిందట.
అంతే కాదు అడ్వాన్స్ డబ్బులు కూడా తిరిగి ఇచ్చేసిందని తెలిసింది.ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త బాగా వైరల్ అవుతుంది.
దీంతో జనాలు పూజ పై ఫైర్ అవుతున్నారు.ఇప్పటికే సరైన సక్సెస్ లేక ఆరాటపడుతున్నావు.
అందులో బంగారం లాంటి సినిమా వదులుకుంటున్నావ్ అని విమర్శలు చేస్తున్నారు.







