మండుటెండలో చల్లటి ఐస్ క్రీం తింటూ చిల్ అవుతున్న పూజా హెగ్డే.. ఫోటో వైరల్!

ప్రస్తుతం వెండితెరపై పలు సినిమాలు కార్యక్రమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న పూజా హెగ్డే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రకృతి ఒడిలో సేద తీరడానికి ఇష్టపడుతున్నారు.ఈ క్రమంలోనే ఈమె తరచూ హాలిడే వెకేషన్ వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

 Pooja Hegde Eating Cold Ice Cream And Getting Chilled Photo Goes Viral, Pooja He-TeluguStop.com

ఇక తాజాగా పూజా హెగ్డే నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని మిగిల్చింది.ఇలా ఈమెకు థియేటర్ వద్ద చేదు అనుభవం ఎదురైనప్పటికీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ విధంగా సినిమా విజయాలతో కాస్త ఒత్తిడికి గురైన ఈమె త్వరలోనే హాలిడే వెకేషన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే పూజా హెగ్డే తన త్రో బ్యాక్ వెకేషన్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలను షేర్ చేసిన పూజా హెగ్డే “వైట్ సాండీ బీచ్ లో మనస్ఫూర్తిగా చల్లటి పానీయం తీసుకుంటూ” అంటూ క్యాప్షన్ పెట్టింది.

దీన్ని బట్టి చూస్తుంటే ఈమె త్వరలోనే వెకేషన్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

బ్లూ కలర్ స్లీవ్ లెస్ టాప్ ధరించి, గోధుమ రంగు హ్యాట్ పెట్టుకొని మండుటెండలో చల్లని ఐస్ క్రీమ్ తింటూ చిల్ అవుతున్న ఫోటోలను ఈ సందర్భంగా ఈమె అభిమానులతో పంచుకున్నారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాలో చేయనున్నారు.

అదేవిధంగా విజయ్ దేవరకొండతో కలిసి మరొక సినిమాకి కూడా ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube