ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది .దీనికోసం బిజెపి మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ద్వారా, తనకు పరిచయం ఉన్న ఆర్ఎస్ఎస్ నాయకుల ద్వారా ఎప్పటి నుంచో చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయినా బిజెపి నుంచి ఎటువంటి సంకేతాలు వెలువడకపోగా… టిడిపితో పొత్తు ఎప్పటికీ ఉండదని, ఇప్పటికే అనేకసార్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించడం వంటివి జరిగిపోయాయి.అయితే బిజెపితో పొత్తు లో ఉన్న జనసేన పార్టీ మాత్రం టిడిపిని కలుపుక వెళ్లాలని , ఏపీలో అధికారంలోకి రావాలని ఆశ పడుతున్నారు. ఈ వ్యవహారం ఇలా ఉంటే తెలంగాణలో బిజెపి బలంగా ఉంది.2023 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా పని చేస్తోంది.ఏదో రకంగా టిఆర్ఎస్ ను ఓడించి తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తోంది.ఈ క్రమంలోనే ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే .ఆ ప్రభావం ఖచ్చితంగా తెలంగాణ లో ఉంటుందని , బీజేపీకి ఓటు బ్యాంకు పెరుగుతుంది అని బిజెపి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అలాగే జనసేన ఓటు బ్యాంకు కూడా తెలంగాణలో కలిసివస్తుందని నమ్ముతున్నారు.

ఏపీలో టీడీపీ శత్రువుగా చూడడం వల్ల , తెలంగాణ ప్రభుత్వం కనిపిస్తుందని ముఖ్యంగా సెటిలర్ల ఓట్ల తో పాటు, తెలంగాణలో ఉన్న టిడిపికి ఓటు బ్యాంకు తమకు కలిసి వస్తుందని బీజేపీ అగ్ర నాయకులు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే ఈ విషయంపై హోంమంత్రి అమిత్ షా తో పాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా క్లారిటీకి వచ్చారని, రాజమండ్రిలో జరిగే బిజెపి గోదావరి గర్జన తరువాత ఏపీలో పొత్తుల అంశం పై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందట.బిజెపి తాజా నిర్ణయం పై టీడీపీ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తోందట.







