యూఎస్ లో పొన్నియన్ సెల్వన్ రికార్డ్.. హైయెస్ట్ తమిళ్ గ్రాసర్ గా..

కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్.ఈ సినిమాను మావెరిక్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించాడు.

 Ponniyin Selvan I Breaks Records, Ponniyin Selvan Collections, Ponniyin Selvan ,-TeluguStop.com

ఈయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ఈ సినిమాను తెరకెక్కించడం కోసం మణిరత్నం ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నాడు.కానీ ఆయన ఈ ప్రాజెక్ట్ చేయడానికి సాధ్యం కాలేదు.

అయితే ఇప్పటికి అది సాధ్యం అయ్యింది.ఈ సినిమా సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేసారు.

ఈ సినిమా మౌత్ టాక్ ఎలా ఉన్న ఓపెనింగ్స్ మాత్రం బాగా వచ్చాయి.

ముందు నుండి బాగా ప్రొమోషన్స్ చేయడంతో అన్ని చోట్ల మంచి బజ్ తోనే రిలీజ్ అయ్యింది.

రిలీజ్ తర్వాత కూడా మెల్లమెల్లగా కలెక్షన్స్ పెరిగాయి.ఏ సినిమా అడ్డు లేకపోవడంతో మొదటి వారం భారీగానే రాబట్టింది.

ఆ తర్వాత కలెక్షన్స్ తగ్గిన మొత్తం డ్రాప్ అవ్వకుండా ఎంతో కొంత వసూళ్లు రాబడుతూనే ఉంది.

Telugu Jayam Ravi, Karti, Kollywood, Mani Ratnam, Maverickmani, Ponniyin Selvan,

ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా బాగానే అలరిస్తుంది అని తెలుస్తుంది.తాజాగా అక్కడ ఈ సినిమా కలెక్షన్స్ వివరాలు బయటకు వచ్చాయి.ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి ఇప్పటికే 400 కోట్లకు పైగానే వసూళ్లు చేసాయి అని తమిళ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరి వారి లెక్కల ప్రకారం తాజాగా యుఎస్ లో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధించినట్టు టాక్.అక్కడ ఈ సినిమా ఆల్ టైం తమిళ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది అని తెలుస్తుంది.

యుఎస్ మార్కెట్ లో ఈ సినిమా 6 మిలియన్ డాలర్స్ మార్క్ ను క్రాస్ చేసి మరో మైల్ స్టోన్ అందుకుంది.దీంతో తమిళులు ఈ సినిమాను ప్రైడ్ గా భావిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో చియాన్ విక్రమ్, హీరో కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, శోభిత దూళిపాళ్ల వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు.

Telugu Jayam Ravi, Karti, Kollywood, Mani Ratnam, Maverickmani, Ponniyin Selvan,

లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకు ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.చూడాలి మరి ఈ సినిమా మొత్తం ఎంత వసూళ్లు సాధిస్తుందో.అలాగే ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

మొదటి పార్ట్ బాగానే ఆకట్టు కోవడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ ను నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube