కల్వకుంట్ల దొంగ దీక్షలు.. రైతుల ఓట్లకై క‘మల’ వేటలు.. మాజి ఎంపీ పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ పట్టణంలో సోమవారం మహాత్మ జ్యోతి బాపులే జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజి ఎంపీ పొన్నం ప్రభాకర్ హాజరై బాపులే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

 Ponnam Prabhakar Criticizes Trs And Bjp Governments Over Farmers Issues Details,-TeluguStop.com

అనంతరం అయన మీడియా సమావేశాన్ని నిర్విహించారు.ఈ సందర్బంగా పొన్నం ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై పొన్నం కామెంట్స్… కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారే త‌ప్ప‌.యాసంగి ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో సౌమ్యంగా చ‌ర్చించి ఒక ప‌రిష్కారం క‌నుగొన‌లేక‌పోతున్నారు.ఈ రెండు ప్ర‌భుత్వాల తీరు వ‌ల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.ధాన్యం కొనుగోలులో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గు చేటు, రైతులను క్షోభపెట్టే పనులు మానుకోవాలి.

ప్రతిధాన్యం గింజను కొంటామని గతంలో ముఖ్యమంత్రి రైతులకు హామీ ఇవ్వడమే కాకుండా, వరి పంటను ప్రోత్సహించారు.

తీరా పంట చేతికి వచ్చిన తర్వాత రైతులకు పంగణామాలు పెట్టి ఢిల్లీలో దొంగ దీక్ష నాటకానికి తెరలేపిండు.కాళేశ్వరం ప్రాజెక్టు వడ్లు పండించేందుకే కట్టారు.తెలంగాణ వ్యవసాయం వరి వైపు వెళ్తున్నదని రెండేళ్ల కిందటే కాంగ్రెస్ హెచ్చరించింది వరి విస్తీర్ణం పెరుగుదల మంచిది కాదని చెబుతూనే వుంది.కేసీఆర్ ప్రభుత్వం దిగొచ్చేదాకా రైతుల పక్షాన నిలబడి ఉద్యమిస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు ఇప్పుడు తోక ముడిచాడు.

గత ఏడేళ్లు తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనగలిగినప్పుడు ఈసారే ఎందుకు కొనడం లేదు? రాష్ట్ర TRS ప్రభుత్వం యాసంగి పంట వెయ్యొద్దు అని చెప్పింది – కేంద్ర BJP ప్రభుత్వం యాసంగి ఒడ్లు కొంటాం అని చెప్పింది.

BJP, TRS రెండూ రైతులని నిలువునా మోసం చేసి ఇప్పుడు ఒకరిమీద ఒకరు నెపం వేసుకుంటున్నారు.

Telugu Bandi Sanjay, Bjp, Congress, Delhi, Farmers, Yasangi Paddy-Political

ఢిల్లీలో నీ దీక్ష రైతుల కోసం కాదు దోపిడీ కోణంలో మిలర్లతో కలిసి ఆడుతున్న దొంగ దీక్ష.ఇది కొంగ జపం, దోపిడీ దీక్ష.ఢిల్లీలో ధాన్యం కొనుగోలు చేయమని టిఆర్ఎస్ దీక్ష చేపట్టటం.ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఇది మొదటి సారి 2023 ఎన్నికల్లో ఓట్లు గుంజుడే ఢిల్లీ దీక్ష లక్ష్యం.

క్వింటాలు 1350 రూపాయలకే రైతుల దగ్గర మిల్లర్లు కొనుక్కొని వెళుతున్నారు.ఇప్పుడు రైతులకు ఎకరాకు 12 వేల రూపాయలు నష్టం వస్తుంది… 60 లక్షల టన్నుల బియ్యానికి 10 శాతం నూకలు వస్తే 1200 కోట్లు ఐతే.పన్నెండు వందల కోట్ల పంచాయతీ మీద 3,600 కోట్ల దోపిడీ కి పునాది వేస్తున్నారు… కోటి ఎకరాల మాగాణి అని చెప్పి ఒక్క గింజ కూడా కొనలేని దగుల్బాజీ దీక్ష.గత ఖరీఫ్లో 60 లక్షల టన్నుల కొనడానికి కేంద్రం ఒప్పుకున్న నేపథ్యంలో మరింత కోనాలని 55 రోజులు కాలయాపన చేసిన విషయం తెలంగాణా రైతాంగం మర్చిపోలేదు.

Telugu Bandi Sanjay, Bjp, Congress, Delhi, Farmers, Yasangi Paddy-Political

రా రైస్ పంచాయతీ రైతులకు ఎందుకయ్యా KCR.? చివరి గింజ వరకు ఒడ్లు కొంటానన్న కెసిఆర్ – మొదటి గింజకే మొండికేసిండు.దొంగ దీక్ష చేస్తున్నానని కాలయాపన చేయడం వల్ల నష్టపోయేది తెలంగాణా రైతులే.ఢిల్లీలో కేసీఆర్ చేసే దీక్ష రైతు దోపిడీ దీక్ష.రాష్ట్ర ప్రభుత్వం కొనేది ఒడ్లు అయితే FCI తీసుకునేది ఒడ్లు అయితే.మరి ఆ ఒడ్లు కొనుట్ల విషయంలో జాప్యం ఎందుకు.

కల్వకుంట్ల దొంగ దీక్షలు.రైతుల ఓట్లకై క‘మల’ వేటలు.

ఢిల్లీలో టీఆర్ఎస్ ధర్నాకు బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసింది.బదులుగా హైదరాబాద్‌లో బీజేపీ ధర్నాకు టీఆర్‌ఎస్‌ అన్ని ఏర్పాట్లు చేసింది.

ఇద్దరూ తోడు దొంగలు, వాళ్ళ ఎజెండా కేవలం పరస్పర ప్రమోషన్ మాత్రమే కాబట్టి ముగింపులో వారు రైతుల ముందు దోషులుగా నిలబడతారు… తెలంగాణ ప్రజలారా, ఇప్పుడైన అర్థం చేసుకోండి, తెరాస+బీజెపీల దొంగానాటకాలు.రైతులను అగాదంలోకి నెట్టి వారి కష్టార్జితం దోచుకునే దోపిడీ ప్లాన్!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube