తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.ఏపీలోని మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, రెండు ఉపాధ్యాయ, నాలుగు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ సాగుతోంది.

 Polling For Mlc Elections Is Ongoing In Telugu States-TeluguStop.com

ఇటు తెలంగాణలోని ఒక ఉపాధ్యాయ స్థానంలో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.

ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.

కాగా ఈనెల 16వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

ప్రకాశం -నెల్లూరు -చిత్తూరు, కడప- అనంతపురం- కర్నూలు, శ్రీకాకుళం -విజయనగరం -విశాఖపట్నం పట్టభధ్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలు, ప్రకాశం -నెల్లూరు -చిత్తూరు, కడప -అనంతపురం -కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలతో పాటు పశ్చిమగోదావరిలో 2, శ్రీకాకుళం, కర్నూలులో ఒక్కొక్కటి చొప్పున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతుంది.

అయితే, స్థానిక సంస్థల నియోజకవర్గాలకు సంబంధించి అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలకు చెందిన 5 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube