Mangalagiri Nara Lokesh: నారా లోకేష్ ఎక్కడ? అయోమయంలో మంగళగిరి టీడీపీ నేతలు!

రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి ఇప్పటం గ్రామంలో అధికారులు పలు ఇళ్ళను కూల్చివేస్తున్నారు.అద్యానంగా మారిన రాష్ట్ర రహదారులకు బాగు చేయండి మహా ప్రభు అని ప్రజలు ఎత్త మెుర పెట్టుకున్న పట్టించుకోక మరమ్మతులు చేయని ప్రభుత్వం.

 Politicsippatam Issue Where Is Nara Lokes , Mangalagiri, Nara Lokesh, Tdp, Chand-TeluguStop.com

ఇప్పటం వంటి చిన్న గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చీవేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.దీంతో ప్రతి పక్షాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.

అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంపై పెద్ద పోరాటమే చేశారు.అయితే ఇందులో ఆశ్చర్యం కలిగించే మరో విషయమేమిటంటే.

నారా లోకేష్ సీన్‌లో కనిపించకపోవడం.మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామం ఉంటుంది.

వచ్చే ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గం నుండే పోటి చేయాలనుకుంటున్న లోకేష్ ఎక్కడ కనిపించకపోవడం పార్టీ నేతలను అయోమయానికి గురి చేసింది.

Telugu Chandrababu, Mangalagiri, Lokesh-Political

పోరాటలతో గ్రామస్తులకు అండంగా  నిలవాల్సి లోకేష్ ఎక్కడ వెళ్ళాడనేది తెలియడం లేదు.ఈ సమయంలో లోకేష్ ప్రజల తరుపున నిల్వవాల్సి పోయింది పూర్తిగా సీన్ నుండి మిస్సయ్యాడు.ఈ విషయంపై చిన్న ట్వీట్ చేసి చేతులు దులుపుకున్నాడు.

అలాగే ఈ ఘటనపై చంద్రబాబు నాయుడు కూడా ట్వీటర్ పోస్టుతో సరిపెట్టాడు.అలాగే పవన్ కళ్యాణ్ పర్యటనను ప్రభుత్వం భగ్నం చేయడాన్ని కూడా ఖండించారు.

ప్రస్తుతానికి టీడీపీ, జనసేన పొత్తును అధికారికంగా ప్రకటించలేదు.అధికారికంగా ప్రకటించే వరకు, ప్రతి అంశంపై రెండు పార్టీలు స్వతంత్రంగా పనిచేయాలి.

ఇక, మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్.అక్కడి నుంచి మరోసారి పోటీ చేయనున్నారు.

ఇంత ముఖ్యమైన నియోజకవర్గం పట్ల టీడీపీ వైఖరి కాస్త అయోమయానికి గురి చేస్తుంది.ఈ విషయంలో టీడీపీ ఎలాంటి నిరసనకు పిలుపునివ్వలేదు.

వైసీపీ ఎదర్కొవాలంటే అవకాశం దొరికిన  ప్రతి విషయంలోనూ పోరాటం చేయాల్సిన టీడీపీ ఇలా నిర్లక్ష్యంగా వ్వవహరించడం పార్టీ నేతలను కాస్త నిరుత్సాహానికి గురి చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube