హీటెక్కుతున్న నంద్యాల రాజకీయం ?

కర్నూలు జిల్లా( Kurnool District )లో జిల్లావ్యాప్తంగా పట్టు ఉన్న రాజకీయ కుటుంబాలలో భూమా కుటుంబం కూడా ఒకటి.

భూమా నాగిరెడ్డి, శోభనాగిరెడ్డి బ్రతికున్న సమయంలో వరుసగా ఈ స్థానాల నుంచి విజయం సాధిస్తూ ఈ నియోజకవర్గాలను తమ కుటుంబానికి కంచుకోటగా మార్చుకున్నారు .

వారి మరణం తర్వాత ఆళ్లగడ్డ బాధ్యతలుఅఖిల ప్రియ తీసుకుంటే, నంద్యాలకు భూమ నాగిరెడ్డి అన్న కొడుకు అయిన భూమా బ్రహ్మానందరెడ్డి( Bhuma Brahmananda Reddy ) ప్రాతినిధ్యం వహిస్తున్నారు.మొదట్లో బ్రహ్మానందరెడ్డి అభ్యర్థిత్వాన్ని సమర్థించిన అఖిలప్రియ తదనంతర పరిణామాలతో అన్నకు వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నారని, నంద్యాల నుంచి ఈసారి తన సొంత తమ్ముడు జగద్విఖ్యాత రెడ్డిని పోటీ చేయించే దిశగా పావులు కదుపుతున్నారని ,ఒకవేళ అధిష్టానం అందుకు అనుమతించకపోతే ఆల్టర్నేటివ్గా స్థానిక లాయర్ అయిన తాతి రెడ్డి తులసి రెడ్డి ని పార్టీలో చేర్పించారని, నంద్యాల టికెట్టు ఈ ఇరువురిలో ఎవరో ఒకరికి వచ్చే విధంగా అధిష్టానం పై అఖిలపై ఒత్తిడి తెస్తున్నారని భూమా బ్రహ్మానందరెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు.

నియోజకవర్గ అభివృద్ధి గురించి తప్ప ఇతర విషయాలలో వేలు పెట్టని తమ నేతకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని భూమా బ్రహ్మానంద రెడ్డి అనుచరులు వార్నింగ్ ఇస్తున్నారట.మరి అన్నా చెల్లెలకు ఏ విషయంలో చెడిందో తెలియదు కానీ వచ్చే ఎన్నికలలో మాత్రం భూమా బ్రహ్మానందరెడ్డి అభ్యర్థత్వాన్ని మార్చాలని అఖిల ప్రియ( Akhila Priya ) గట్టిగా పట్టుపడుతున్నట్లు తెలుస్తుంది.నంధ్యాల లో పార్టీ ఆఫీసు ను కూడా ఓపెన్ చేసిన అఖిల ప్రియ బ్రహ్మానందరెడ్డి కి వ్యతిరేకం గా పావులు కడుపుతుంది అని బ్రహ్మానందరెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు .

ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అధిష్టానం ఆశీస్సులు కూడా బాగానే సంపాదించుకున్న బ్రహ్మానందరెడ్డి వచ్చే ఎన్నికల్లో టికెట్ పై ధీమా గానే ఉన్నట్టు తెలుస్తుంది .మరి భూమా బ్రహ్మానందరెడ్డి ధీమా గెలుస్తుందో లేక అఖిల ప్రియ పట్టు గెలుస్తుందో , అధిష్టానం ఆశీస్సులు ఎవరి వైపు ఉన్నాయో మరికొన్ని రోజులలో ఒక అంచనా కు రావచ్చు.

Advertisement
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

తాజా వార్తలు