తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పరిస్థితి గందరగోళంగా మారింది.ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పార్టీకి చెందిన కీలక నేతలు ఎంతోమంది కాంగ్రెస్ లో చేరిపోయారు.
ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి వలస వెళ్తున్నారు.ఈ వలసలు సర్వసాధారణంగా మారిపోయాయి.
మరోవైపు చూస్తే లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడింది.ఈ సమయంలో పార్టీ నుంచి వలసలు వెళ్లిపోతున్న నేతల సంఖ్య ఎక్కువగా ఉండటం, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ వలసలకు బ్రేక్ వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం అవుతుండడంతో, చివరకు ఈ విషయంలో చేతులెత్తేసినట్టుగా కనిపిస్తోంది.
దిగువ స్థాయి కేడర్ నుంచి మంత్రులుగా పనిచేసిన కీలక నేతల వరకు చాలామంది బీ ఆర్ ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోతుండడం వంటివి సర్వసాధారణంగా మారిపోయాయి .ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా, అధికార పార్టీలో చేరేందుకే నేతలు మొగ్గు చూపిస్తున్నారని, ఆ వలసలకు బ్రేక్ వేసేందుకు తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా అనవసరం అన్న అభిప్రాయానికి కెసిఆర్ ,కేటీఆర్( KCR, KTR ) లు వచ్చినట్టుగా కనిపిస్తున్నారు.
పార్టీ నుంచి లీడర్లు వెళ్లిపోయినా కేడర్ ను మాత్రం కాపాడుకోవాలనే విధంగా కేసీఆర్ పార్టీ నేతలకు సూచనలు చేస్తున్నారు.పార్టీ అధికారంలో లేని కారణంగానే పార్టీ నుంచి వలసలు సర్వసాధారణమే అని కేసీఆర్ చెబుతున్నారు .అయితే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha elections ) ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుందనే లెక్కల్లో కేసీఆర్ కేటీఆర్ లు నిమగ్నం అయ్యారట.అయితే పార్టీలోని మిగిలిన నేతలకు మాత్రం ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.