పూరి జగన్నాథ్( Puri Jagannath ) తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉండడం మన అదృష్టమనే చెప్పాలి.ఆయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో మరే దర్శకుడు చేయలేదని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ప్రతి సినిమాకి వేరేవాళ్లు అనుకుంటే ఆ తర్వాత మరొక హీరో వచ్చి చేరుతారు.మళ్లీ ఆ హీరోకి తగ్గట్టుగా కథలో మార్పులు చేర్పులు చేసి సినిమాలు చేసి మంచి విజయాన్ని అందుకోవడంలో ఆయన ఎప్పుడు ముందు వరుసలో ఉంటారనే చెప్పాలి.
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాకు సంబంధించిన హీరోలు మారుతూ వచ్చారు.
ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, దేశముదురు లాంటి సినిమాలను ముందుగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో చేయాలి అనుకుంటే అది కుదరక లేదు.దాంతో రవితేజ, అల్లు అర్జున్ తో చేయాల్సి వచ్చింది.ఇక ఆ తర్వాత పోకిరి సినిమాని కూడా ముందు పవన్ కళ్యాణ్ తో అనుకున్నా అది వర్కౌట్ అవలేదు.
దాంతో మహేష్ బాబు తో ఈ సినిమా చేసి సూపర్ సక్సెస్ కొట్టాడు.ఇక లోఫర్ సినిమాని నితిన్ తో చేయాల్సింది.కానీ చివరి నిమిషంలో వరుణ్ తేజ్ తో చేశాడు.ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాని విజయ్ దేవరకొండ తో చేయాల్సింది.
కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో రామ్ తో చేసి సూపర్ సక్సెస్ అందుకున్నాడు.ఇలా పూరి ఒకరితో అనుకున్న సినిమాను మరొకరితో చేయడం ఆయనకు కొత్త అయితే కాదు.ప్రతి సినిమా విషయంలో ఆయనకు జరిగింది ఇదే… కాబట్టి ఆయన అందుకే ముందు నుంచి ఒకరిద్దరి హీరోలని స్పేర్ లో పెట్టుకుని కథ రాసుకుంటున్నట్టుగా ఒకానొక సందర్భంగా తెలియజేశాడు… అందుకే పూరి ఒక హీరో డేట్స్ ఇవ్వకపోయినా ఇబ్బంది పడకుండా మరో హీరోతో సినిమా చేస్తూ ముందుకు కదులుతాడు…
.