రాజా సింగ్ కు సెట్‌ అయ్యే పార్టీ రాష్ట్రంలోనే లేదా?

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం లో బిజెపి ( BJP ) తరపున రాజాసింగ్( Raja Singh ) మాత్రమే ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.బిజెపి కి ప్రాతినిధ్యం వహిస్తూ హిందుత్వ అజెండాను మోస్తూ రాజాసింగ్ ఎప్పుడు వార్తలో నిలుస్తూ ఉండేవాడు.

 Political Parties Not Interested In Mla Raja Singh Details, Bjp, Raja Singh, Ts-TeluguStop.com

ఆ మధ్య వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా జైలుకు వెళ్లిన రాజాసింగ్ బిజెపి నుండి బహిష్కరింపబడ్డాడు.జైలు లో సుదీర్ఘం కాలం పాటు ఉన్న రాజా సింగ్ బయటకు వచ్చిన తర్వాత బిజెపి మళ్లీ తనను పార్టీ లోకి తీసుకుంటుందని భావించాడు.

కానీ బిజెపి నాయకత్వం రాజా సింగ్ పై ఆసక్తిగా లేరు ఆయన వివాదాస్పద తీరు కారణంగా పార్టీ కి నష్టం జరుగుతుందని ముఖ్య నాయకులు మరియు అధినాయకత్వం భావిస్తుందట.

అందుకే ఆయన ను పక్కన పెట్టారు అంటూ ప్రచారం జరుగుతుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాజా సింగ్ రాబోయే ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేయబోవడం లేదు.ఇటీవల ఆయన తెలుగు దేశం పార్టీలో( TDP ) జాయిన్ కాబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

మొదట్లో ఆయన తెలుగు దేశం పార్టీ కి చెందిన నాయకుడు అనే విషయం తెలిసిందే.అందుకే మళ్ళీ తెలుగు దేశం పార్టీ లో జాయిన్ అవుతాడని అన్నారు.

కానీ ఆ పార్టీ లో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు.బిజెపి లో కొనసాగే పరిస్థితి లేదు.ఇతర పార్టీ లో ఆయన ఉండే అవకాశం కూడా లేదు.అందుకే రాజా సింగ్ కి తెలంగాణ లో ఏ ఒక్క పార్టీ కూడా చేరేందుకు అవకాశం లేదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాజా సింగ్ రాజకీయం గురించి ప్రస్తుతం తెలంగాణ లో రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.రాజా సింగ్ వచ్చే ఎన్నికల నాటికి ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటాడేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube