ఖమ్మంలో పొలిటికల్ హీట్.. ఎంపీ అభ్యర్థిగా రఘురాం రెడ్డి తరపున నామినేషన్.!!

త్వరలో లోక్ సభ ఎన్నికలు( Loksabha Elections ) రానున్న నేపథ్యంలో ఖమ్మంలో పొలిటికల్ హీట్( Khammam Politics ) రోజురోజుకు పెరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరనే దానిపై అధికారిక ప్రకటన రాకముందే నేతలు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు.

ఈ మేరకు ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రఘురాం రెడ్డి తరపున స్థానిక నేతలు నామినేషన్ వేశారు. ఖమ్మం ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాం ( Khammam MP Candidate Raghuram )తరపున రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.

రఘురాం రెడ్డి తరపున నిరంజన్ రెడ్డి, స్వర్ణకుమారి, రాజశేఖర్, నరేశ్ రెడ్డి మరియు రామ్మూర్తి నాయక్ నామినేషన్ దాఖలు చేశారు.అయితే నామినేషన్ గడువు( Nomination ) ముగియనున్నప్పటికీ ఏఐసీసీ ఇప్పటివరకు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పేరును ప్రకటించలేదన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో రఘురాం రెడ్డి అనుచరులు నామినేషన్ వేశారు.అయితే ఖమ్మం ఎంపీ స్థానం కోసం పలువురు నేతలు పార్టీ అధిష్టానాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే.

Advertisement
తెలివితేటల్లో ఐన్‌స్టీన్‌నే మించిపోయిన భారత సంతతి బాలుడు.. వయసు పదేళ్లే!

తాజా వార్తలు